ICC: ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లే వీరే!
వన్డే ప్రపంచ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరో 15 రోజుల్లో భారత్ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించే ఈ మెగా టోర్నీలో సెంచరీలు చేయడం ఆటగాళ్లకు ఓ కల వంటిది. అయితే వన్డే ప్రపంచ కప్‌లో ఇప్పటివరకూ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ భారీ స్కోర్లు చేయడంలో దిట్ట. ఇప్పటివరకూ వార్నర్ రెండు వన్డే వరల్డ్ కప్ మ్యాచులను ఆడాడు. ఈ మెగా టోర్నీలో 18 మ్యాచులు ఆడి 62 సగటుతో 992 పరుగులు సాదించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలను బాదాడు.
అత్యధిక పరుగులు చేసిన వారిలో మూడోస్థానంలో సంగక్కర
రికీ పాంటింగ్ ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ ఇప్పటివరకూ రెండుసార్లు ఆ జట్టుకు ప్రపంచ కప్ ను అందించాడు. ఇక 2003లో భారత్‌తో ఫైనల్లో అతడు చేసిన సెంచరీని క్రికెట్ అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు. (1996, 1999, 2003, 2007, 2011)ఎడిషన్లో 46 మ్యాచులను రికీ పాటింగ్ ఆడాడు. ఇందులో 45.86 సగటుతో 1,743 పరుగులు చేశాడు. అతని ఖాతాలో ఐదు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలున్నాయి. సంగక్కర శ్రీలంక మాజీ సారథి కుమార సంగక్కర వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో మూడో స్థానంలో ఉన్నాడు. వరల్డ్ కప్ మ్యాచుల్లో 37 ఇన్నింగ్స్‌లు ఆడి 1532 పరుగులు చేశాడు. 56.74 సగటుతో ఐదుశతకాలు, ఏడు హాఫ్ సెంచరీలను బాదాడు.
కుమార సగక్కర రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ
రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు వన్డే ప్రపంచ కప్ మ్యాచులను ఆడాడు. ఐసీసీ వన్డే కప్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ కూడా రోహితే. 2019 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ ఏకంగా ఐదు సెంచరీలను బాది, కుమార సంగక్కర రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటివరకూ 17 మ్యాచుల్లో 978 పరుగులను సాధించారు. ఇక రోహిత్ ఖాతాలో ఆరు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలున్నాయి. సచిన్ టెండుల్కర్ టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఆరు వన్డే ప్రపంచ కప్‌లు ఆడాడు. 45 మ్యాచుల్లో 2278 పరుగులు చేశాడు. సచిన్ ఖాతాలో ఆరు శతకాలు, 15 హాఫ్ సెంచరీలున్నాయి.