IND vs NZ: భారత్ vs న్యూజిలాండ్.. సెమీస్ ప్రత్యర్థి తేలేదీ నేడే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. గ్రూప్ దశలో ఇప్పటికే రెండు విజయాలు సాధించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
ఇవాళ గ్రూప్-ఏలో చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. న్యూజిలాండ్ కూడా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.
ఈ మ్యాచ్ విజేత గ్రూప్-ఏలో అగ్రస్థానంతో ఉన్న ఆస్ట్రేలియాను ఎదుర్కొంటుంది, ఓడిన జట్టు దక్షిణాఫ్రికాతో సెమీస్ ఆడనుంది.
సెమీఫైనల్ సమీకరణాలు
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏలో టాప్ ప్లేస్‌లో నిలుస్తుంది. దీంతో సెమీఫైనల్‌లో గ్రూప్-బీలో రెండో స్థానంలో ఉన్న ఆసీస్‌తో తలపడనుంది.
ఓడిన జట్టు గ్రూప్-బి టాపర్ దక్షిణాఫ్రికాతో పోటీపడనుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా గ్రూప్-బీలో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది.
Details
తుది జట్లపై ఉత్కంఠ
భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే తమ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లను ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాయి. దీంతో ఈ చివరి మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది. సెమీస్‌లో ఎవరిని ఎదుర్కొనాలనే ఉత్కంఠ ఈ పోరుతో తేలనుంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుంటాడని వార్తలు వచ్చినా, అతడు పూర్తి ఫిట్‌గా ఉండటంతో ఈ మ్యాచ్ ఆడనున్నట్లు సమాచారం.
పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉండగా, అతడి స్థానంలో అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
అలాగే కేఎల్ రాహుల్‌కు విశ్రాంతి ఇచ్చి రిషభ్ పంత్‌కు అవకాశం కల్పించనున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది.
Details
విరాట్ కోహ్లీకి 300వ వన్డే మైల్‌స్టోన్
న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌కు అనారోగ్యం కారణంగా దూరమైన హిట్టర్ డారిల్ మిచెల్ పూర్తిగా కోలుకున్నాడు.
అతడు తుది జట్టులో ఉంటాడని న్యూజిలాండ్ టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇది 300వ వన్డే కానుంది. 2017లో తన 200వ వన్డేను కూడా న్యూజిలాండ్‌పై ఆడిన కోహ్లీ, అప్పుడు సెంచరీ చేశాడు.
ఇప్పుడు 300వ వన్డే కూడా న్యూజిలాండ్‌తోనే జరగడంతో ఈ మ్యాచ్‌లో కోహ్లీపై మరింత ఎక్కువ దృష్టి ఉండనుంది.