Page Loader
India vs WI: ఐదో టీ20లో భారత్ తడబాటు.. సిరీస్ విండీస్ వశం
India vs WI: ఐదో టీ20లో భారత్ తడబాటు.. సిరీస్ విండీస్ వశం

India vs WI: ఐదో టీ20లో భారత్ తడబాటు.. సిరీస్ విండీస్ వశం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2023
12:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్లోరిడా వేదికగా జరిగిన నిర్ణయాత్మక ఐదో T20 లో టీం ఇండియా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించి సిరీస్ ను వశం చేసుకుంది. దింతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను విండీస్ 3-2తో కైవసం చేసుకుంది. అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే 61 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్రాండన్ కింగ్(85)నికోలస్ పూరన్(47)చెలరేగడంతో విండీస్ గెలుపు సునాయాసమైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్, తిలక్ వర్మ తలో వికెట్ పడగొట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆఖరి టీ20లో చేతులెత్తేసిన భారత్