Page Loader
Asian Games 2023 : చరిత్ర సృష్టించిన భారత్.. ఆసియా క్రీడల్లో మరో గోల్డ్ మెడల్
చరిత్ర సృష్టించిన భారత్.. ఆసియా క్రీడల్లో మరో గోల్డ్ మెడల్

Asian Games 2023 : చరిత్ర సృష్టించిన భారత్.. ఆసియా క్రీడల్లో మరో గోల్డ్ మెడల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 26, 2023
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత ఈక్విస్ట్రియన్ జట్టు చరిత్రను సృష్టించింది. ఆసియా క్రీడల్లో 41 ఏళ్ల తర్వాత తొలిసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. భారత్ చివరగా 1982లో ఈక్వెస్ట్రియన్ విభాగంలో బంగారు పతకం నెగ్గింది. ఆ తర్వాత ఈ విభాగంలో భారత్‌కు గోల్డ్ మెడల్ దక్కడం ఇదే మొదటిసారి. టీమ్ డ్రెస్సేజ్ ఈవెంట్‌లో భారత టీమ్ 209.205 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత చైనా 204.882 స్కోరు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఈ అపూర్వ విజయాన్ని సాధించిన ఈ టీమ్‌లో సుదీప్తి హజేలా, హృదయ్‌ విపుల్‌ చెదా, అనుష్‌ గార్వల్లా, దివ్యక్రితి సింగ్‌ ఉన్నారు.

Details

మూడు పతకాలను సాధించిన భారత సెయిలర్ లు

ఈ బంగారు పతకంలో కలిసి ఆసియా క్రీడల ఈక్వెస్ట్రియన్ విభాగంలో భారత్ మొత్తం నాలుగు గోల్డ్ మెడల్స్ ను సాధించింది. ఇక ఆసియా క్రీడల చరిత్రలో ఈక్వెస్ట్రియన్ విభాగంలో మొత్తం పతకాల సంఖ్య 13కు చేరుకుంది. మరోవైపు ఆసియా క్రీడల్లో భారత సెయిలర్‌లు సరికొత్త చరిత్రను సృష్టించనున్నారు. మంగళవారం భారత సెయిలర్‌లు ఏకంగా మూడు పతకాలు సాధించారు. ఇక స్క్వాష్‌లోనూ భారత క్రీడాకారులు అదరగొట్టారు. పూల్-బిలో పాకిస్థాన్ తో జరిగిన పోరులో 3-0తో భారత్ విజయం సాధించింది.