భారత్ అనే పదం ఎల్లప్పుడు ఉంటుంది : భారత హాకీ గోల్ కీపర్
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న జి-20 సదస్సు విందు ఆహ్వానాన్ని 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' పేరుతో కాకుండా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' పేరుతో పంపడంపై వివాదం నెలకొంది.
ఈ విషయంపై కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడనున్నాయి. తాజాగా ఈ వివాదంపై భారత హకీ కీపర్ పీఆర్ రాజేష్ స్పందించాడు.
ఇది తనకు కొత్త ప్రశ్న, ఎందుకంటే తాను ఎప్పుడూ 'భారత్ మాతా కీ జై' అని అంటానని, ఇప్పుడు భారతదేశం అని రాస్తున్నారని, ఇది కొత్త అనుభూతిని కలిగిస్తోందని, ఇండియా నుండి భారత్‌కు మారడం నిజంగా సవాలుగా ఉందని రాజేష్ పేర్కొన్నారు.
Details
మెరిసే సెండ్ ఆఫ్ వేడకకు హజరైన క్రీడల మంత్రి
IOA మెరిసే సెండ్-ఆఫ్ వేడుకను భారత ఒలింపిక్ సంఘం నిర్వహించింది, దీనికి కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, IOA ప్రెసిడెంట్ PT ఉష ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
భారత హాకీ గోల్‌కీపర్లు పిఆర్ శ్రీజేష్ (పురుషులు), సవితా పునియా (మహిళలు), షూటింగ్ సంచలనం మను భాకర్, 2018 ఆసియా క్రీడల షాట్‌పుట్ స్వర్ణ పతక విజేత తజిందర్‌పాల్ సింగ్‌తో ఇతర విభాగాలకు చెందిన క్రీడాకారులు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
2018లో జరిగిన ఆసియా క్రీడల చివరి ఎడిషన్‌లో భారత బృందం 16 స్వర్ణాలతో సహా 70 పతకాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.