Page Loader
IND Vs IRE : తొలి టీ20లో యువ ఆటగాళ్లతో బరిలోకి భారత్.. యార్కర్లతో బుమ్రా చెలరేగేనా..?
రేపటి నుంచి ఇండియా, ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్

IND Vs IRE : తొలి టీ20లో యువ ఆటగాళ్లతో బరిలోకి భారత్.. యార్కర్లతో బుమ్రా చెలరేగేనా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2023
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, ఐర్లాండ్ మధ్య మూడు టీ20 మ్యాచుల సమరానికి సమయం అసన్నమైంది. ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న రాత్రి 7: 30 గంటలకు డబ్లిన్ జరగనుంది. టీమిండియా స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా గాయం నుంచి కోలుకొని, భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ ను భారత్ ను కోల్పోయింది. మరోవైపు ఐర్లాండ్ ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో 1-2 తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటివరకూ టీ20ల్లో భారత్‌పై ఐర్లాండ్ విజయం సాధించకపోవడం గమనార్హం. ఐర్లాండ్ బ్యాటర్ ఆండ్రూ బల్బిర్నీ టీ20ల్లో 2వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి 35 పరుగుల దూరంలో ఉన్నాడు

Details

వంద వికెట్లకు చేరువలో మార్క్

ఐర్లాండ్ తరఫున వెటరన్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ 3,397 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐర్లాండ్ రైట్ ఆర్మ్ సీమర్ మార్క్ టీ20 ఫార్మాట్‌లో 100 వికెట్లను పూర్తి చేయడానికి కేవలం 3 వికెట్ల దూరంలో ఉన్నాడు. తొలి టీ20 మ్యాచులో ఓపెనర్లుగా యశస్వీ జైస్వాల్, రుత్‌రాజ్ గైక్వాడ్ దిగనున్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ తరుఫున అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. భారత్ vs ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్ 1వ T20 మ్యాచ్, ఆగస్ట్ 18, రాత్రి 7.30, డబ్లిన్. 2వ T20 మ్యాచ్, ఆగస్టు 20, రాత్రి 7.30, డబ్లిన్. 3వ T20 మ్యాచ్, 23 ఆగస్టు, రాత్రి 7.30, డబ్లిన్.