Champions Trophy: ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
భారత దివ్యాంగ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది.
శ్రీలంకలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్‌ను 79 పరుగుల తేడాతో ఓడించింది.
ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టంతో 197 పరుగుల భారీ స్కోర్‌ను చేసింది.
ఇంగ్లండ్ ఛేదనలో 118 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో భారత్ విజయం సాధించింది.
వివరాలు
యోగేంద్ర భదోరియా విధ్వంసం
ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు యోగేంద్ర భదోరియా విధ్వంసాన్ని సృష్టించాడు.
అతను 40 బంతుల్లో నాలుగు బౌండరీలు, ఐదు సిక్సర్లతో 73 పరుగులు సాధించాడు.
భారత బౌలర్లు కూడా విశేషంగా రాణించారు.రాధికా ప్రసాద్ 3.2 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన కనబరచాడు.
కెప్టెన్ విక్రాంత్ కేనీ 3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర సంటే 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
వివరాలు
కోచ్ రోహిత్ జలానీ అభినందనలు
చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయాన్ని ప్రధాన కోచ్ రోహిత్ జలానీ మెచ్చుకున్నాడు.
జట్టు అసాధారణ ప్రదర్శన, సన్నద్ధతను ప్రశంసిస్తూ, టోర్నీ మొత్తం తమ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని, విభిన్న పరిస్థితుల్లో ఎదురైన ప్రతీ సవాలును అధిగమించారని చెప్పారు.
DCCI ప్రకటన
భారత దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ (DCCI) ఛాంపియన్స్ ట్రోఫీ విజయం గురించి అధికారికంగా ప్రకటించింది.
కృషి, దృఢ సంకల్పం, నైపుణ్యంతో అద్భుత ప్రదర్శన కనబరిచిన జట్టుకు అభినందనలు తెలిపింది.
వివరాలు
విక్రాంత్ కేనీ వ్యాఖ్యలు
మెగా టోర్నీలో భారత జట్టును కెప్టెన్‌గా నడిపిన విక్రాంత్ కేనీ, ఈ విజయాన్ని తన కెరీర్‌లో గొప్ప గౌరవంగా అభివర్ణించాడు.
జట్టులోని ప్రతీ ఆటగాడు ఈ చారిత్రాత్మక విజయంలో భాగస్వామిగా నిలిచినట్లు పేర్కొన్నాడు.
ఈ విజయాన్ని భారతదేశం తరపున క్రికెట్ ఆడాలని కలలు కన్న ప్రతి దివ్యాంగుడికి అంకితం చేస్తున్నట్లు DCCI ఒక ప్రకటనలో తెలిపింది.