LOADING...
World Boxing Championships: ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు బంగారు పతకం
ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు బంగారు పతకం

World Boxing Championships: ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు బంగారు పతకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2025
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ ఘన విజయాన్ని అందుకుంది. మహిళల 57 కిలోల విభాగంలో జైస్మీన్‌ లాంబోరియా అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించారు. లివర్‌పూల్ వేదికగా జరిగిన ఫైనల్‌లో ఆమె పోలాండ్‌కు చెందిన జూలియాపై 4-1 తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచారు. ఇదిలావుంటే, భారత్‌కు చెందిన నుపుర్‌ షెరోన్‌ 80 కేజీల పైన కేటగిరీలో రజత పతకం గెలుచుకోగా, పూజా రాణి 80 కేజీల విభాగంలో కాంస్య పతకంతో మెరిశారు. అయితే పురుషుల విభాగంలో మాత్రం భారత బాక్సర్లు ఒక్క పతకమూ సాధించకుండా ఛాంపియన్‌షిప్‌ను ముగించారు.