
IND vs WI: రెండో టెస్టులో భారత్ ఘన విజయం.. విండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 121 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి 63/1తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు, మరో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కేఎల్ రాహుల్ (58*) హాఫ్ సెంచరీతో మెరిశాడు. సాయి సుదర్శన్: (39) రాణించాడు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 2, జోమెల్ వారికన్ 1 వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 518/5 వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (175), శుభ్‌మన్ గిల్ (129*), ధ్రువ్ జురెల్ నితీశ్ రెడ్డి (43) అద్భుత ప్రదర్శనతో రాణించారు.
Details
రాణించిన భారత ఆటగాళ్లు
ఇక బౌలింగ్ విభాగంలో కుల్‌దీప్ యాదవ్ (5/82), జడేజా (3/46) విజృంభించడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో విండీస్ 248 పరుగులకే ఆలౌటైంది. 270 పరుగుల లోటుతో ఫాలో ఆన్‌లో పడింది. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కరేబియన్ జట్టు అద్భుతంగా రాణించింది. కాంప్‌బెల్ (115), షై హోప్ (103) సెంచరీలకు తోడు జస్టిన్ గ్రీవ్స్ (50*), రోస్టన్ ఛేజ్ (40), జైడెన్ సీల్స్ (32) రాణించడంతో 390 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయం ద్వారా భారత్ అల్ రౌండర్ ప్రదర్శనతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది, ముఖ్యంగా కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ ప్లేయర్లు బ్యాటింగ్‌లో మెరిశారు.