Page Loader
IND vs SA: సౌతాఫ్రికాపై భారత్ విక్టరీ.. సిరీస్ కైవసం
సౌతాఫ్రికాపై భారత్ విక్టరీ.. సిరీస్ కైవసం

IND vs SA: సౌతాఫ్రికాపై భారత్ విక్టరీ.. సిరీస్ కైవసం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2023
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా యువ జట్టు అద్భుతంగా రాణించింది. కచ్చితంగా నెగ్గాల్సిన మూడో వన్డేల్లో సమష్టిగా రాణించి సౌత్ ఆఫ్రికాపై 78 పరుగుల తేడాతో గెలుపొందారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల 296 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో సౌతాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు అలౌటైంది. భారత బ్యాటర్లలో సంజు శాంసన్ (Sanju Samson) 114 బంతుల్లో (16 ఫోర్లు, 1 సిక్సర్) 108 పరుగులతో చెలరేగిపోయాడు. తిలక్ వర్మ(Tilak Varma) 52 హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించాడు. చివర్లో రింకూ సింగ్ (Rinku Singh) 38 మెరుపులు మెరిపించడంలో టీమిండియా 296 పరుగులను చేయగలిగింది.

Details

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన సంజు శాంసన్

రెండో వన్డేలో సెంచరీ చేసిన సౌతాఫ్రికాకు విజయాన్ని అందించిన జోర్జి, మరోసారి లక్ష్య చేధనలో 81 పరుగులు చేసి సత్తా చాటాడు. దక్షిణాఫ్రికా తరుఫున జోర్జిదే అత్యధిక స్కోరు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టారు. అర్ష్ దీప్ 4 వికెట్లతో చెలరేగగా, అవేశ్ ఖాన్ 2, సుందర్ 2, అక్షర్ పటేల్, ముకేష్ కుమార్ తలా ఓ వికెట్ తీశారు. అంతర్జాతీయ మ్యాచులో తొలి శతకం నమోదు చేసిన సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలిచాడు.