
Asian Games : ఫైనల్లో అడుగుపెట్టిన భారత పురుషుల హాకీ టీమ్
ఈ వార్తాకథనం ఏంటి
చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా గేమ్స్ లో భారత పురుషుల హాకీ జట్టు విజయపరంపరం కొనసాగుతోంది.
టోర్నీ ఆరంభం నుంచి ఓటమి అనేదే లేకుండా నేడు దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
బుధవారం సెమీఫైనల్లో దక్షిణ కొరియాపై భారత్ హాకీ జట్టు 5-3 తేడాతో విజయం సాధించింది.
దీంతో ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు ఇప్పటివరకూ 11 సార్లు ఫైనల్‌కు చేరుకుంది.
ఇక శుక్రవారం జరగనున్న సెమీ ఫైనల్లో చైనా లేదా జపాన్‌తో భారత్ తలపడనుంది.
Details
వంద పతకాలకు చేరువలో ఇండియా
ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలకు చేరువైంది. ఇప్పటివరకూ భారత్ 73 పతకాలను సాధించింది.
1951లో ఆసియా క్రీడలు ప్రారంభం నుంచి భారత్ 70 పతకాల మార్కును దాటలేకపోయింది.
బుధవారం ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నం, ఓజాస్ డియోటాలే భారత్‌కు 16వ బంగారు పతకాన్ని అందించారు.
బాక్సింగ్‌లో లోవ్లినా బోర్గోహైన్ రజతంతో సరిపెట్టుకుంది.