
Mohammed Siraj: భారత్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మంత్ టైటిల్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు (ఆగస్టు 2025) గెలుచుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ, వెస్టిండీస్ పేసర్ జైడెన్ సీల్స్‌ల నుండి గట్టి పోటీ ఎదురైనా, సిరాజ్ వారిపై ఆధిపత్యం చూపించి ఈ బహుమతి దక్కించుకున్నారు. ఇంగ్లండ్‌లో జరిగిన 5టెస్టుల సిరీస్‌ను భారత్2-2తో సమం చేసింది. ఆ ఫలితంలో సిరాజ్ ప్రదర్శన కీలకమైంది. ఐదు టెస్టుల తొమ్మిది ఇన్నింగ్స్‌లలో ఆయన 23 వికెట్లు తీశారు. అందులో రెండు సార్లు 5 వికెట్లు, ఒకసారి 4 వికెట్లు తీసి తన పేస్ శక్తిని చూపించారు. 32.43 సగటుతో వికెట్లు సాధించిన సిరాజ్ బౌలింగ్ టీమిండియాకు పెద్ద ఆస్తిగా మారింది.
Details
ఓవల్ టెస్ట్‌లో టర్నింగ్ పాయింట్
ఓవల్ టెస్ట్ ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఆయన 9 వికెట్లు (సగటు 21.11) తీశారు. మొత్తం సిరీస్‌లో అత్యధికంగా 1113 బంతులను సిరాజ్ వేశాడు. ఆ అద్భుతమైన స్పెల్ కారణంగానే ఆయనకు 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు వరించింది. ఆగస్టు నెలలో ఆడిన ఏకైక టెస్ట్ కూడా అదే కావడం విశేషం. అవార్డు అందుకున్న అనంతరం సిరాజ్ మాట్లాడుతూ ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు అని, ఆండర్సన్-టెండూల్కర్ సిరీస్ గట్టి పోటీ, అది అద్భుతమైన జ్ఞాపకాలను మిగిల్చిందని చెప్పారు. ఈ విజయం తనకే కాదు, తన సపోర్ట్ స్టాఫ్, జట్టు సహచరులకు కూడా చెందుతుందని అన్నారు.