Page Loader
Vinesh Phogat: త్వరలో కాంగ్రెస్‌లోకి భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్!
త్వరలో కాంగ్రెస్‌లోకి భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్!

Vinesh Phogat: త్వరలో కాంగ్రెస్‌లోకి భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2024
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు బలం చేకూరుస్తూ శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాను వినేశ్ మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ పరిణామాల మధ్య వినేశ్ ఫోగాట్‌కు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమెకు మద్దతుగా పెద్ద సంఖ్యలో నెటిజన్లు పోస్టులు కూడా చేశారు. ఆమె ప్యారిస్ నుంచి తిరిగి రాగానే దిల్లీలో కూడా అపూర్వ స్వాగతం లభించింది. కాంగ్రెస్‌ ఎంపీ దీపేందర్‌ హుడా ఆమె మెడలో మాల వేసి సత్కరించారు.

Details

పోలీసులు భద్రత కల్పించడం లేదంటూ ఆరోపణలు

ఇక పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువుతో వినేశ్ ఫోగాట్ అనర్హతకు గురైన విషయం తెలిసిందే. స్వగ్రామంలో జరిగిన సన్మాన సభలో తమ పోరాటం కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హర్యానా పోలీసులు తనకు భద్రత కల్పించడం లేదంటూ ఆమె సంచనల ఆరోపణలు చేసింది. వినేష్ ఫోగాట్ వ్యాఖ్యలను దిల్లీ పోలీసులు ఖండించారు. రెజ్ల‌ర్ల‌కు భద్ర‌త‌ను ఉప‌సంహ‌రించామ‌నే వార్త‌లు అబ‌ద్ధమని స్పష్టం చేశారు.