Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
ఈ ప్రెస్టీజియస్ టోర్నమెంట్‌లో ఎనిమిది దేశాలు పోటీపడతాయి. బీసీసీఐ ఈ టోర్నీ కోసం భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి 15 మందితో కూడిన జట్టు వివరాలు వెల్లడించారు.
ఏదైనా మార్పులు చేయాల్సి ఉంటే, ఫిబ్రవరి 13లోపు అవకాశం ఉందని వారు తెలిపారు.
ఇందుకు ముందు ముంబై వాంఖడే మైదానంలో రెండున్నర గంటలకు పైగా జరిగిన బీసీసీఐ సమావేశంలో ఈ జట్టు ఎంపికపై చర్చ జరిగింది.
అయితే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆ సమావేశానికి హాజరుకాలేదు. ఆయన తన నివేదికను శుక్రవారం సమర్పించినట్లు సమాచారం.
Details
వన్డే సిరీస్ కూ ఇదే జట్టు
బీసీసీఐ ప్రకటించిన ప్రకారం, ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కూ ఇదే జట్టు కొనసాగుతుంది. ఫిబ్రవరి 6 నుంచి 12 మధ్య ఈ మూడు వన్డేల సిరీస్ జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. టీమ్‌ఇండియా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో, ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా తలపడనుంది.
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఐసీసీ నిర్వహించే ఈ టోర్నమెంట్ పునరాగమనం కావడం విశేషం.
పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో భారత జట్టు మ్యాచ్‌లు యూఏఈలో జరుగుతాయి. చివరిసారి భారత జట్టు 2013లో మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది.
Details
భారత జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్)
శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, షమీ, అర్ష్‌దీప్ సింగ్