Page Loader
Table tennis: ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల ఘనత.. తొలిసారిగా కాంస్య పతకం!
ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల ఘనత.. తొలిసారిగా కాంస్య పతకం!

Table tennis: ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల ఘనత.. తొలిసారిగా కాంస్య పతకం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 09, 2024
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

అసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. తొలిసారిగా కాంస్య పతకాన్ని సాధించిన చరిత్రకెక్కింది. ఈ పోటీలను ఆసియన్ టేబుల్ టెన్నిస్ యూనియన్ నిర్వహిస్తోంది. భారత మహిళల జట్టు ఈ కాంస్య పతకాన్ని పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం. సెమీఫైనల్‌లో భారత్ జట్టు జపాన్‌తో 1-3 తేడాతో ఓడింది. మరో సెమీఫైనల్‌లో, చైనా చేతిలో హాంకాంగ్ జట్టు కూడా ఓటమి పాలైంది. సెమీఫైనల్స్‌లో ఓడిన ఈ రెండు జట్లకు కాంస్య పతకం అందింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో, భారత్ 3-2తో దక్షిణ కొరియాపై విజయం సాధించి పతకం దక్కించుకోవడం విశేషం.