
India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
లండన్ పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో బీసీసీఐ బలమైన జట్టును ఎంపిక చేసింది. ఈ సారి మరింత దూకుడుగా ఆడేందుకు, గట్టిగా పోటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో జట్టును రూపొందించామని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టు లండన్ పర్యటనలో భాగంగా టీ20,వన్డే క్రికెట్ మ్యాచ్‌లు ఆడనుంది. వన్డే మ్యాచ్‌ల కోసం ఎంపికైన జట్టులో హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. ఆటగాళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
వివరాలు
వన్డే మ్యాచ్
హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్, స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రాడ్జియస్, రీచా ఘోష్(వికెట్ కీపర్) యస్తికా భాటియా(వికెట్ కీపర్), తేజల్ హసబ్ నిస్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్ జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సాయాలి సఘారే ఉన్నారు. టీ20 జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్, స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలి వర్మ, హర్లీన్ డియోల్, జెమిమా రాడ్జియస్, రీచా ఘోష్(వికెట్ కీపర్) యస్తికా భాటియా(వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్, అమన్ జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, సాయాలి సఘారే
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ విమెన్ చేసిన ట్వీట్
🚨NEWS - Team India (Senior Women) squads for the upcoming England tour announced 🚨
— BCCI Women (@BCCIWomen) May 15, 2025
A look at the squads for T20Is and ODIs 👇#TeamIndia | #ENGvIND pic.twitter.com/lrUMzF09f8