
Indonesia Open: ప్రి క్వార్టర్స్ కి దూసుకెళ్లిన సింధు, ప్రణయ్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ గాడిలో పడింది. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది.
మంగళవారం తొలి రౌండ్‌లో స్థానిక క్రీడాకారిణి గ్రెగొరియా మరిస్క తన్ జంగ్ ను వరుస గేమ్ లలో ఓడించి ఫ్రీ క్వార్టర్ కు అర్హత సాధించింది.
సింధు 21-19, 21-15తో మరిస్కను చిత్తు చేసింది. పురుషుల విభాగంలో హెచ్ఎస్ ప్రణయ్ కూడా అదరగొట్టాడు. అయితే త్రిసా-గాయత్రి జోడి తొలి రౌండ్ లోనే నిష్క్రమించి ఇంటిబాట పట్టారు.
తొలి రౌండ్‌లో 22--20, 12--21, 16--21తో రిన్ ఇవానగ-కియో నకానిషి (జపాన్) జంట చేతిలో పోరాడి త్రిసా-గాయత్రి జోడి ఓడిపోయింది.
Details
తైజుయింగ్ తో పోరాడనున్న పీవీ సింధు
మెన్స్ సింగిల్స్‌లో ఏడో సీడ్ ప్రణయ్ 21-16, 21-14తో కెంటా నిషిమోటో (జపాన్)పై వరుస గేమ్స్‌లో గెలిచి ప్రిక్వార్టర్స్ కి అర్హత సాధించాడు.
కేవలం 60 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఓడించాడు. ప్రణయ్ గతేడాది మలేషియా మాస్టర్స్ టైటిల్ ను గెలుచుకున్న విషయం తెలిసిందే.
మరో మ్యాచ్‌లో ఎంఆర్ అర్జున్-ధ్రువ్ కపిల జంట ఓడిపోయి ఇంటిదారి పట్టింది.
ఇక ప్రి క్వార్టర్స్ లో సింధుకి కఠిన సవాల్ ఎదురు కానుంది. తదుపరి మ్యాచులో సింధు మూడో సీడ్, చైనాకు చెందిన తైజు యింగ్ తో పోరాడనుంది.