Mumbai Indians: ఘజన్‌ఫర్‌కు గాయం.. ముంబై ఇండియన్స్‌లోకి కొత్త మిస్టరీ స్పిన్నర్ ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంది. మార్చి 22 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ఆరంభంకానుంది.
ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ తమ జట్టును మరింత పటిష్ఠం చేసుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
టీమ్ స్క్వాడ్ ఇప్పటికే రెడీ అయినా, గాయపడ్డ ఓ ప్లేయర్ స్థానంలో కొత్త ప్లేయర్‌ను జట్టులోకి చేర్చుకుంది.
ఆ ప్లేయర్ మరెవరో కాదు ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్.
Details
ఘజన్‌ఫర్‌కు గాయం.. ముజీబ్ ఎంట్రీ
ముంబై ఇండియన్స్ మెగా వేలంలో రూ.4.8 కోట్లకు కొనుగోలు చేసిన కుర్ర మిస్టరీ స్పిన్నర్ ఏఎం ఘజన్‌ఫర్ దురదృష్టవశాత్తు గాయపడి, సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
దీంతో అతని స్థానంలో అదే దేశానికి చెందిన అనుభవజ్ఞుడైన ముజీబ్‌ను రీప్లేస్‌మెంట్‌గా ముంబై ఫ్రాంచైజీ తీసుకుంది
Details
ఆఫ్ఘనిస్థాన్ జట్టు వద్దనుకున్న ముజీబ్‌కి ముంబైలో ఛాన్స్!
ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ఇటీవల ప్రకటించిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టులో ముజీబ్‌కు చోటు ఇవ్వలేదు. అతని స్థానంలో ఘజన్‌ఫర్‌ను ఎంపిక చేశారు.
కానీ అతను గాయపడటంతో ఆ స్క్వాడ్‌లోకి నంగేయాలియా ఖరోటే అనే ప్లేయర్‌ను ఎంపిక చేశారు.
ఇలా ఆఫ్ఘనిస్థాన్ జట్టు అవసరం లేదనుకున్న ముజీబ్‌కు ముంబై ఇండియన్స్ రూపంలో అదృష్టం కలిసి వచ్చింది.
గత కొన్ని సీజన్లుగా ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, 2025లో ఏకంగా ఆరోవ టైటిల్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.