Arjun Tendulkar:ఘనంగా అర్జున్ తెందూల్కర్ పెళ్లి వేడుకలు.. అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ ప్రపంచంలో లెజెండ్‌గా నిలిచిన సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. మార్చి మొదటి వారంలో ఆయన కుమారుడు అర్జున్ తెందూల్కర్ వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. తన స్నేహితురాలు సానియా చందోక్‌తో అర్జున్ పెళ్లి జరగనుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ముకేష్ అంబానీ(Mukesh Ambani)కుటుంబం ప్రీ-వెడ్డింగ్ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేసింది. గుజరాత్‌లోని జామ్ నగర్'లో నిర్వహించిన ఈ వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఈ కార్యక్రమానికి నీతా అంబానీతో పాటు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా, అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ తదితర అంబానీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వివరాలు
అర్జున్,సానియా జీవితాంతం ఆనందంగా కలిసి ఉండాలని ఆశీర్వదించిన నీతా అంబానీ
ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ, సచిన్,అంజలి తెందూల్కర్‌లతో తమ కుటుంబానికి ఉన్న సన్నిహిత అనుబంధాన్ని గుర్తుచేశారు. వారిని తమ ఇంటివారిలా భావిస్తామని చెప్పారు. అనంత్,రాధికా జీవిత ప్రయాణం కూడా ఇక్కడినుంచే ప్రారంభమైందని ఆమె పేర్కొన్నారు. అర్జున్‌ను తమ స్కూల్‌లో చిన్నపిల్లాడిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నామని అన్నారు. సానియా చుట్టూ సానుకూల వాతావరణం ఎప్పుడూ కనిపిస్తుందని చెప్పారు. ఈ జంట జీవితాంతం ఆనందంగా కలిసి ఉండాలని ఆశీర్వదించారు.
వివరాలు
ముంబయి ఇండియన్స్ తరఫున ఆడిన అర్జున్
సచిన్ తెందూల్కర్‌కు అంబానీ కుటుంబంతో చాలా కాలంగా స్నేహబంధం ఉంది. ముఖ్యంగా ముకేశ్ అంబానీతో ఆయనకు దశాబ్దాలుగా వ్యక్తిగత అనుబంధం కొనసాగుతోంది. ముంబయి ఇండియన్స్ జట్టుకు సచిన్ మెంటర్‌గా సేవలందిస్తున్నారు. అర్జున్ కూడా పలు సీజన్లలో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడాడు. అంతేకాకుండా, అర్జున్ ముంబయిలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (Dhirubhai Ambani International School)లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అర్జున్-సానియా వివాహానికి అంబానీల ఆశీర్వాదం
We are touched by your kind gesture, Mukesh bhai, Nita bhabhi, Anant and Akash.
— Sachin Tendulkar (@sachin_rt) February 26, 2026
Moments like these feel even more meaningful when shared with family and friends who have been part of the journey. https://t.co/eCYxoRBTvH