IPL 2026: హైదరాబాద్ vs రాజస్థాన్.. ఓపెనర్లే మ్యాచ్‌ను తేలుస్తారా?
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌ల్లో రెండు జట్లు పరస్పరం పోటీ పడుతూ బ్యాటింగ్, బౌలింగ్ సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్ మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ పోరులో ఇరుజట్ల ఓపెనింగ్ జోడీల మధ్య ఆసక్తికర సమరం కనిపించనుంది. ఒకవైపు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మరోవైపు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైశ్వాల్.. ఈ జంటల్లో ఏది అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందో చూడాలి. ముఖ్యంగా ఎడమచేతి బ్యాటర్ల మధ్య ఈ పోటీ మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
వివరాలు
భారీ స్కోర్ సాధించే జట్టు..
ఈ ఐపీఎల్ సీజన్‌లో గెలుపోటముల విషయాన్ని పక్కన పెడితే, 300 పరుగుల భారీ స్కోర్‌ను సాధించే సామర్థ్యం ఉన్న జట్లు సన్‌రైజర్స్, రాజస్థాన్. ఇందుకు ప్రధాన కారణం ఈ జట్లలో ఉన్న శక్తివంతమైన ఓపెనర్లు. పవర్‌ప్లేలోనే 100 పరుగులు సాధించే సామర్థ్యం ఈ రెండు జంటలకూ ఉంది. అయితే ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఉన్న సన్‌రైజర్స్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోతోంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు కేవలం ఒకే విజయం నమోదు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడం జట్టుపై ప్రభావం చూపుతోంది.
వివరాలు
మెరుగైన ప్రదర్శన అవసరం..
బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, బౌలింగ్ విభాగం విఫలమవుతోంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 220 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జైదేవ్ ఉనద్కట్, ఇషాన్ మలింగ, హర్షల్ పటేల్‌లతో కూడిన పేస్ దళం మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది.
వివరాలు
రాజస్థాన్ రాయల్స్‌కు అదనపు బలం..
ఇక మరోవైపు రియాన్ పరాగ్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి, 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఃయువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్‌లో ఉండటం జట్టుకు ప్రధాన బలంగా మారింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే 266.66 స్ట్రైక్‌రేట్‌తో 200 పరుగులు నమోదు చేశాడు. అందులో రెండు అర్ధసెంచరీలు ఉండటం విశేషం. అవి కూడా కేవలం 15 బంతుల్లోనే సాధించడం అతని ప్రతిభను చాటుతోంది. యశస్వి జైశ్వాల్, ధ్రువ్ జురెల్ కూడా దూకుడుగా ఆడుతుండగా, జోఫ్రా ఆర్చర్ నేతృత్వంలోని బౌలింగ్ విభాగం స్థిరంగా రాణించడం రాజస్థాన్‌కు అదనపు బలం ఇస్తోంది.