అభివృద్ధి, శాంతి కోసమే అంతర్జాతీయ క్రీడా దినోత్సవం
మనిషి శారీరకంగా దృఢంగా, చురుగ్గా ఉండడం క్రీడలు అవసరం. క్రీడలు ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఎంతోమంది క్రీడలు ద్వారా ఉన్నత స్థానాలకు వెళ్లారు. అభివృద్ధి, శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏప్రిల్ 6 న నిర్వహించడం అనవాయితీ. సామాజిక మార్పును తీసుకురావడానికి, శాంతి మరియు అవగాహన పెంపొందించడానికి ఒక సాధనంగా క్రీడలు ఉపయోగపడతాయి. ఈ రోజు క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఓ ప్రత్యేక సందర్భాన్ని సూచిస్తుంది. అభివృద్ధి, శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని 1896లో ప్రారంభించారు. 2013లో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ క్రీడా దినోత్సవంగా ఏప్రిల్ 6ని ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా స్థిరమైన అభివృద్ధి, శాంతిని క్రీడలు ప్రభావితం చేస్తాయి
అంతర్జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఓ థీమ్ ను ఏర్పాటు చేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన అభివృద్ధిని, శాంతిని క్రీడలు ఎలా ప్రభావితం చేస్తాయో అర్ధమయ్యేలా వివరించింది. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆగస్టు 23, 2013న 67/296 తీర్మానాన్ని ఆమోదించింది, దీని ద్వారా ఏప్రిల్ 6ని అభివృద్ధి, శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. దీనికి ఒలంపిక్ కమిటీ మద్దతు ఇచ్చింది. క్రీడలు వ్యక్తుల శారీరక, మానసిక వికాసాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి, మెరుగైన ఆరోగ్యం, సామాజిక ఏకీకరణ, లింగ సమానత్వం, ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ సహకారం, సోదరభావం, శాంతిన్ని ప్రోత్సహిస్తాయి.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి