Page Loader
వన్డే ప్రపంచ కప్ నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్
శస్త్ర చికిత్స చేయించుకోనున్న కేన్ విలియమ్సన్

వన్డే ప్రపంచ కప్ నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2023
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది భారత్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ వరల్డ్ కప్ ఆరంభానికి ముందే న్యూజిలాండ్ జట్టు గట్టి షాక్ తగిలింది. చైన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ గాయపడ్డ విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో మోకాలి గాయంతో మైదానాన్ని వీడిన విలియమ్సన్.. మొత్తం ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. ఆక్లాండ్ విమానాశ్రయంలో ఊతకర్రల సాయంతో నడుస్తున్న విలియమ్సన్ వీడీయో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. కేన్ మోకాలికి మరో మూడువారాల్లో శస్త్రచికిత్స జరగనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది. దీంతో అతను వన్డే వరల్డ్‌కప్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. శస్త్రచికిత్స అనంతరం విలియమ్సన్ పునరవావాసంలో ఉంటాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.

కేన్ విలియమ్సన్

త్వరగా మైదానంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నం చేస్తా : కేన్ విలియమ్సన్

గత కొన్ని రోజులుగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, గుజరాత్ టైటాన్స్ నుంచి తనకు మద్దతు లభిస్తోందని విలియమ్సన్ పేర్కొన్నారు. అయితే గాయం తనను తీవ్ర ఇబ్బందికి గురి చేసిందని, ప్రస్తుతం తన దృష్టి అంతా సర్జరీపైనా, పునరాసంపైనే ఉందని వెల్లడించారు. త్వరగా మైదానంలో అడుగు పెట్టేందుకు ప్రయత్నం చేస్తానని విలియమ్సన్ తెలిపారు. ఐపీఎల్ కు దూరమైన కేన్ విలియమ్సన్ స్థానంలో శ్రీలంక వన్డే కెప్టెన్ దనుష్ షనకు రూ. 50 లక్షలకు గుజరాత్ టైటాన్స్ తీసుకున్న విషయం తెలిసిందే.