IPL2023: ధోనితో పోటిపడానికి సై అంటున్న హార్ధిక్ పాండ్యా
మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2023 ప్రారంభ కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు విజేత అయిన చైన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. టాస్ గెలిచిన జట్టు మంచు కారణంగా బౌలింగ్ ఎంచుకొనే అవకాశం ఉంటుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో రాత్రి 7:30గంటలకు మ్యాచ్ ప్రసారం కానుంది. గత సీజన్‌లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన గుజరాత్.. ఇప్పటివరకూ చైన్నైతో రెండుసార్లు తలబడింది. ఈ రెండు మ్యాచ్‌లోనూ గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది. గుజరాత్ పై తొలి విజయాన్ని అందుకోవాలని చైన్నై తహతహలాడుతోంది.
గుజరాత్, చైన్నైజట్టులోని సభ్యులు
రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్ మొయిన్ అలీలాంటి స్టార్ ఆల్ రౌండర్లతో చైన్నై బలంగా కనిపిస్తోంది. గుజరాత్ తరుపున హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ కీలకంగా వ్యవహరించనున్నారు. GT (ప్రాబబుల్ XI): శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్-కీపర్), కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), మాథ్యూ వేడ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, ఆర్ సాయి కిషోర్, శివమ్ మావి, అల్జారీ జోసెఫ్. CSK (ప్రాబబుల్ XI): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, శివమ్ దూబే, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని (కెప్టెన్ & వికెట్ కీపర్), దీపక్ చాహర్, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, మతీషా పతిరానా.