IPL: ప్రత్యర్థి బ్యాటర్లను వణికించడానికి దీపక్ చాహర్ రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
గాయం కారణంగా గత సీజన్‌కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ స్పీడ్ స్టార్ దీపక్ చాహర్ ఐపీఎల్ 16వ సీజన్ లో ఆడనున్నాడు. సీఎస్కే తరుపున 2018 నుంచి అడుతున్న చాహర్ నాణ్యమైన బౌలింగ్‌తో అకట్టుకున్నాడు.
ప్రత్యర్థులను యార్కర్లతో భయపెట్టే సత్తా చాహర్‌కు ఉంది. అతను సీఎక్కే తరుపున ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆరో బౌలర్‌గా నిలిచాడు.
ఐపీఎల్‌లో 27.70 సగటుతో 58 వికెట్లు పడగొట్టాడు. అతను పవర్‌ప్లే ఓవర్లలో అత్యధికంగా 44 వికెట్లను పడగొట్టాడు. 2018లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసి సత్తా చాటాడు. ట్రెంట్ బౌల్ట్ 38 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో ఉన్నాడు.
చాహర్
చాహర్ సాధించిన రికార్డులివే
చాహర్ 2016లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. అనంతరం 2018లో సీఎస్కే కి మారాడు. మొత్తంమీద, అతను 63 ఐపీఎల్ మ్యాచ్‌లలో 59 వికెట్లను తీశాడు.
చాహర్ 2016లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. అనంతరం 2018లో సీఎస్కే కి మారాడు. మొత్తంమీద, అతను 63 ఐపీఎల్ మ్యాచ్‌లలో 59 వికెట్లను తీశాడు. 2019లో చాహర్ 22 వికెట్లు తీసి సీఎస్కే ఫైనల్ వెళ్లడానికి కృషి చేశాడు.
ఐపీఎల్ 2019లో పవర్‌ప్లేలో చాహర్ 162 డాట్ బాల్స్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2012లో పంజాబ్ కింగ్స్ తరఫున ప్రవీణ్ కుమార్ 139 డాట్ బాల్స్ వేసి రెండో స్థానంలో ఉన్నాడు.