Page Loader
ఐపీఎల్‌లో డాన్స్‌తో రచ్చచేయనున్న తమన్నా
ఐపీఎల్‌లో సందడి చేయనున్న తమన్నా

ఐపీఎల్‌లో డాన్స్‌తో రచ్చచేయనున్న తమన్నా

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2023
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 16వ సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభ వేడుకలను బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా దక్షిణాదితో పాటు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌తో ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించనుంది తాజాగా ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకులను టాలీవుడ్ భామ తమన్నా భాటియాకు అహ్వానం అందింది. ఆహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో మార్చి 31న గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నిలో పది జట్లు రెండున్నర నెలల పాటు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌‌లో తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

ధోని

మహేంద్ర సింగ్ ధోనిపై భారీ ఆశలు

ఐపీఎల్‌లో కోవిడ్‌కు ముందు 2019లో కూడా ప్రారంభ వేడుకలను నిర్వహించలేదు. కాశ్మీర్ లో భారత సైనికులపై పూల్వామా బాంబు దాడి నేపథ్యంలో ఆ ఏడాది ప్రారంభ వేడుకలను రద్దు చేశారు. నాలుగేండ్ల తర్వాత ఐపీఎల్ లో ఓపెనింగ్ సెర్మనీని నిర్వహిస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హ్యాపీడేస్‌తో తెలుగులో కమర్షియల్ సక్సెస్ కొట్టిన మిల్కీ బ్యూటీ తమన్నా.. తెలుగులో అగ్రహీరోలందరితోనూ నటించింది. ప్రస్తుతం చిరంజీవితో బోళా శంకర్, రజినీకాంత్‌తో జైలర్ లలో నటిస్తోంది. ఆటగాడిగా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ చైన్నైసూపర్ కింగ్స్‌పై అభిమానులు భారీ అశలు పెట్టుకున్నారు.