ఐపీఎల్‌లో యంగ్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడ్‌లో హవా
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2023 సీజన్లో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. సీనియర్ ప్లేయర్స్ కి ధీటుగా యంగ్ ప్లేయర్లు మైదానంలో ఆడి విజృంభిస్తున్నారు. తమ ఆటతీరుతో అందరినీ ఔరా అనిపిస్తున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లో లీడ్ లో యువ ఆటగాళ్లు ఉండడం విశేషం. ముంబై ఇండియన్స్ పై సెంచరీతో విజృంభించిన రాజస్థాన్ యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ లీడ్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఇక పర్పుల్ క్యాప్ లీడ్ లో తుషార్ దేశ్ పాండే నంబర్ వన్ ప్లేస్ లో నిలిచాడు.
ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ లో ముంబై చేతిలో రాజస్థాన్ ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.
Details
పర్పుల్ క్యాప్ లీడ్ లో చైన్నై ఆటగాడు
ఐపీఎల్ లో ఎనిమిది మ్యాచ్ లో ఆరు విజయాలతో గుజరాత్ 12 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఐదు విజయాలతో లక్నో సెకండ్ ప్లేస్ కొనసాగుతుండగా.. రాజస్థాన్ మూడో స్థానంలో ఉంది. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో చైన్నై, పంజాబ్ నిలిచాయి. ఇక ముంబై ఇండియన్స్ నాలుగు విజయాలతో ఏడో స్థానానికి ఎగబాకింది.
9 మ్యాచ్లో జైస్వాల్ 428 రన్స్ చేసి మొదటి స్థానంలో ఉండగా.. 422 రన్స్ తో డుప్లెసిస్ రెండో స్థానం, 414 పరుగులతో కాన్వే మూడో స్థానంలో నిలిచాడు.
పర్పుల్ క్యాప్ లిస్టులో చైన్నై ఆటగాడు దేశ్ పాండే 17 వికెట్లతో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. అతని తర్వాత అర్షదీప్ సింగ్ (15వికెట్లు), సిరాజ్(14 వికెట్లు) నిలిచారు.