Page Loader
IPL 2023: లక్నో, ఆర్సీబీ మధ్య బిగ్ ఫైట్
నేడు ఆర్సీబీ, లక్నో ఢీ

IPL 2023: లక్నో, ఆర్సీబీ మధ్య బిగ్ ఫైట్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 01, 2023
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 43వ మ్యాచ్లో మరో ఆసక్తికరమైన పోరు జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో ఆర్సీబీ తలపడనుంది. ఆటల్ బిహారి వాజ్ పేయ్ స్టేడియంలో మ్యాచ్ రాత్రి 7:30గంటలకు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు తలపడిన గత మ్యాచ్లో మొదట ఆర్సీబీ 212 రన్స్ చేస్తే.. లక్నో 213 పరుగులు చేసి ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. దీంతో లక్నోపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. ఐపీఎల్ కెరియర్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకూ ముడుసార్లు తలపడగా.. అందులో ఆర్సీబీ రెండుసార్లు విజయం సాధించింది. ప్రస్తుతం 8 మ్యాచ్ లు ఆడిన లక్నో అందులో ఐదు విజయాలను నమోదు చేయగా.. బెంగళూరు ఎనిమిది మ్యాచ్లో నాలుగింట్లో విజయం సాధించింది.

Details

ఇరు జట్లలోని సభ్యులు

ఆర్సీబీ బ్యాటర్లు కోహ్లీ, మాక్స్ వెల్, డుప్లెసిస్ అద్భుత ఫామ్ లో ఉన్నారు. లక్నో తరుపున కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ రాణించడం ఆ జట్టుకు అదనపు బలమని చెప్పొచ్చు. లక్నో సూపర్ జెయింట్స్ : KL రాహుల్ (c), కైల్ మేయర్స్, ఆయుష్ బడోని, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (WK), నవీన్-ఉల్-హక్, అవేష్ ఖాన్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్ ఆర్సీబీ: విరాట్ కోహ్లీ (సి), ఫాఫ్ డు ప్లెసిస్, షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్), సుయాష్ ప్రభుదేసాయి, వనిందు హసరంగా, జోష్ హేజిల్‌వుడ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్