
IPL 2023: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పంజాబ్ క్రికెటర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. విజయాలతో దూకుడు మీద ఉన్న పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా రేపు ( ఏప్రిల్ 9న ) సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ ఆడనుంది.
ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన శిఖర్ ధావన్ సేన నేడు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొననుంది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ను మట్టికరిపించి ఐపీఎల్‌లో మొదటి విజయాన్ని నమోదు చేయాలని మార్ర్కమ్ సేన తహతహలాడుతోంది.
ఇది ఇలా ఉండగా.. పంజాబ్ క్రికెటర్లు రాహుల్ చాహర్, హర్ ప్రీత్ బ్రార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలిశారు. ఈ సందర్భంగా బన్నితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.
సన్‌రైజర్స్
ఇవాళ హైదరాబాద్‌కు చేరుకోనున్న సన్‌రైజర్స్ టీం
ఇందుకు సంబంధించిన ఫోటోలను రాహుల్ చాహర్ తన సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కాగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
ఇక అతిథ్య ఎస్‌ఆర్‌హెచ్ జట్టు లక్నో నుంచి ఇవాళ హైదరాబాద్‌కు చేరుకోనుంది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 121 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 16 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేధించారు.