IPL 2023: ఢిల్లీని బెంబేలెత్తించిన రషీద్ ఖాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ విజృంభించాడు. నాలుగు ఓవర్లలో 3/31తో ఢిల్లీ బ్యాటర్లను రషీద్ ఖాన్ హడలెత్తించాడు. అతడితో పాటు మహ్మద్ షమీ కూడా మూడు వికెట్లతో చెలరేగాడు.
ఐపీఎల్‌లో 94 మ్యాచ్‌లు ఆడిన రషీద్ ఖాన్ 20.42 సగటుతో 117 వికెట్లు తీశాడు. ముఖ్యంగా రషీద్ గుజరాత్ తరపున 24 వికెట్లు తీశాడు.
సాయి సుదర్శన్
హాఫ్ సెంచరీ చేసిన సాయి సుదర్శన్
మొదట 13 ఓవర్‌లో బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్, అభిషేక్ పోరెల్ వికెట్‌ను తీశాడు. అనంతరం 17 ఓవర్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ను పెవిలియానికి పంపాడు. 19 ఓవర్ చివర్లో అమన్ హకీమ్ ఖాన్ వికెట్ తీసి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
గుజరాత్ తరుపున అక్షర పటేల్ మెరవడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును చేసింది. పృథ్వీ షా (7) మరోసారి విఫలం అయ్యాడు. వన్ డౌన్‌లో వచ్చిన మిచెల్ మార్ష్ (4) మరోసారి నిరాశపరిచాడు.
గుజరాత్ తరుపున సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ చేసి జట్టును అదుకున్నాడు. ఇక చివర్లో డేవిడ్ మిల్లర్ బౌండరీల వర్షం కురిపించడంతో గుజరాత్ విజయాన్ని అందుకుంది.