Page Loader
ఆ ఒక్కడే మా పతనాన్ని శాసించాడు : డేవిడ్ వార్నర్
ఢిల్లీ ఓటమిపై స్పందించిన డేవిడ్ వార్నర్

ఆ ఒక్కడే మా పతనాన్ని శాసించాడు : డేవిడ్ వార్నర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2023
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ విజయాల పరంపర కొసాగిస్తోంది. ఇప్పటికే ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన గుజరాత్ జట్టు, మంగళవారం ఆరుణ్ జైట్లీ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ జట్టు బ్యాటర్ సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్‌లో జట్టు ఓటమిపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. పిచ్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయామని, సాయి సుదర్శన్ ఆ సాధారణ బ్యాటింగ్‌తో తమ ఓటమిని శాసించాడని, ఈ ఓటమి తమకు ఓ గుణపాఠమని పేర్కొన్నారు.

గుజరాత్

6 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం

మొదట కొన్ని ఓవర్లలో తాము స్వింగ్‌కు అశించామని, అయితే సాయి సుదర్శన్ బాగా ఆడానని, మిల్లర్ తాను చేయాల్సిన పని పూర్తి చేశాడని, మంచుతో కూడా కాస్త ఇబ్బంది ఎదురైందని వార్నర్ పేర్కొన్నారు. ఈ పిచ్‌పై 180-190 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని, పిచ్ పరిస్థితులు, వికెట్ కారణంగానే అక్షర్ పటేల్‌తో బౌలింగ్ చేయించలేదని, ఇంకా చాలా మ్యాచ్ లు ఉన్నాయని వివరించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 18.1 ఓవర్లలోనే 163 పరుగులు చేసి 11 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.