Page Loader
IPL 2023: ఐపీఎల్‌లో శుభ్‌మాన్ గిల్ పేరిట సూపర్ రికార్డు 
ఐపీఎల్ లో అద్భుత రికార్డును సొంతం చేసుకున్న గిల్

IPL 2023: ఐపీఎల్‌లో శుభ్‌మాన్ గిల్ పేరిట సూపర్ రికార్డు 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2023
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో గుజరాత్ స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ సూపర్ రికార్డును నెలకొల్పాడు. ఈ సీజన్ లో మంచి ఫామ్ లో ఉన్న గిల్, గుజరాత్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఐపీఎల్ లో 700 పైగా రన్స్ చేసిన రెండో భారతీయుడిగా గిల్ నిలవడం విశేషం. ఇప్పటివరకూ 14 మ్యాచులు ఆడి రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలను బాదాడు. మొత్తం మీద 722 పరుగులను గిల్ చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో డుప్లెసిస్ తో అతను పోటీపడుతున్నాడు. మంగళవారం చైన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో ఈ రికార్డును గిల్ నెలకొల్పాడు. అతడి కంటే ముందు స్థానంలో కోహ్లీ నిలిచాడు.

Details

కోహ్లీ తర్వాతి స్థానంలో గిల్

విరాట్ కోహ్లీ తర్వాత ఐపీఎల్ సీజన్లో 700 పైగా పరుగులు చేసిన రెండో భారత్ క్రికెటర్ గా శుభ్‌మాన్ గిల్ నిలిచాడు. 2016 సీజన్లో కింగ్ కోహ్లీ నాలుగు సెంచరీలతో 973 పరుగులు సాధించాడు. దీంతో ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ ప్లేయర్ గా చరిత్రకెక్కాడు. కోహ్లీ రికార్డును ఇప్పటివరకూ ఎవరూ బ్రేక్ చేయకపోవడం గమనార్హం. 722 పరుగులతో కోహ్లీ తర్వాతి స్థానంలో గిల్ ఉన్నాడు. అదే విధంగా ఓకే సీజన్లో ఏడు వందలకు పైగా పరుగులు చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా గిల్ మరో రికార్డును సాధించడం విశేషం. ఈ సీజన్లో 730 రన్స్ తో డుప్లెసిస్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 722 పరుగులతో గిల్ రెండో స్థానంలో ఉన్నాడు.