తదుపరి వార్తా కథనం

Alzarri Joseph: అల్జారీ జోసెఫ్‌ను రూ.11.50 కోట్లకు సొంతం చేసుకున్న ఆర్సీబీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 19, 2023
05:02 pm
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్ స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్(Alzarri Joseph)ను రూ.11.50 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది.
జోసెఫ్ తన ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థులను భయపెట్టగలడు. జోసెఫ్ ఇప్పటివరకూ 101 టీ20ల్లో 121 వికెట్లు పడగొట్టాడు.
26 ఏళ్ల ఇతను కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఘనమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 44 సీపీఎల్ మ్యాచుల్లో 48 వికెట్లను తీశాడు.
జోసెఫ్ 2019లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసాడు.
Details
ఐపీఎల్ 20 వికెట్లు పడగొట్టిన అల్జారీ జోసెఫ్
2024 వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ ఈ ప్లేయర్ ను విడుదల చేసింది. ఇప్పటివరకూ 19 ఐపీఎల్ మ్యాచుల్లో 20 వికెట్లను తీశాడు.
జోసెఫ్ గతేడాది జూలైలో టీమిండియాతో జరిగిన టీ20లో అరంగేట్రం చేశాడు.
ఈ ఫార్మాట్‌లో 19 గేమ్‌లు ఆడిన అతను 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓసారి ఐదు వికెట్లను తీశాడు.