Page Loader
IPL 2024: ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్, ఇతర వివరాలు
IPL 2024: ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్, ఇతర వివరాలు

IPL 2024: ఐపీఎల్ 2024 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్, ఇతర వివరాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 22, 2024
06:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2024 మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, తోలి 21 మ్యాచ్ లకే షెడ్యూల్ విడుదలైంది. ఈ 21 మ్యాచ్ లు మార్చి 22-ఏప్రిల్ 7వ తేదీ వరకు జరగనున్నాయి. లోక్ సభ 2024 ఎన్నికల తేదీలు ప్రకటించిన తరువాత మిగిలిన షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు. సాధారణంగా డిఫెండింగ్‌ చాంపియన్‌- రన్నరప్‌ మధ్య మ్యాచ్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ కొత్త ఎడిషన్‌ ఆరంభింస్తారు. అయితే, ఈ సారి అందుకు భిన్నంగా సీఎస్‌కే- గుజరాత్‌ టైటాన్స్‌కు బదులు.. సీఎస్‌కే- ఆర్సీబీతో పదిహేడవ ఎడిషన్‌ మొదలుపెట్టనున్నారు. తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌లో భాగంగా పది జట్లు బరిలో దిగనున్నాయి. మార్చి 23, 24, 31న డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్టార్ స్పోర్ట్స్ చేసిన ట్వీట్