IPL: ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో ఓడినా.. చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2024 ఫైనల్లో ఓటమి పాలైనా, సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఈ సీజన్‌లో రికార్డులతో చరిత్ర సృష్టించింది.
అసాధారణ ప్రదర్శనతో ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని ఘనతలను నమోదు చేసింది.
ముఖ్యంగా,ఓపెనర్లు అభిషేక్ శర్మ,ట్రావిస్ హెడ్ తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ మొత్తం 178 సిక్స్‌లు బాదడం ద్వారా ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా నిలిచింది.
అదేవిధంగా,287/3, 277/3స్కోర్లు సాధించి టీ20క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్లు నమోదు చేసిన తొలి ఐపీఎల్ జట్టుగా ఘనత అందుకుంది.
అభిషేక్ శర్మ - ట్రావిస్ హెడ్ ద్వయం 220.2స్ట్రైక్‌రేట్‌తో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ధాటిగా ఆడిన ఓపెనింగ్ జోడీగా నిలిచారు.
వివరాలు
అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన టీమ్‌గా రికార్డు
అలాగే, పవర్‌ప్లేలో 125 పరుగులు నమోదు చేసి అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలవడంతో పాటు, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన టీమ్‌గా రికార్డు సృష్టించింది.
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 167 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలో ఛేదించి మరో అరుదైన రికార్డును నెలకొల్పింది.
ఈ సీజన్‌లో అభిషేక్ శర్మ 42 సిక్స్‌లు బాది అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా, ట్రావిస్ హెడ్ 64 ఫోర్లతో అత్యధిక బౌండరీలు బాదిన ప్లేయర్‌గా నిలిచారు.
వివరాలు
ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో అత్యల్ప స్కోరు
ఈ విజయాలను గుర్తు చేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక ప్రత్యేక పోస్టర్ రూపొందించి అభిమానులతో షేర్ చేసుకుంది.
అయితే, చివరి పోరులో మాత్రం సన్‌రైజర్స్ తడబడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్లో పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో కేవలం 113 పరుగులకే ఆలౌటై, 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
దీంతో ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా నిలిచింది.
అయినా, సన్‌రైజర్స్ ధాటిగా ఆడిన బ్యాటింగ్ స్టైల్‌కి అభిమానులు అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు.