NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL Top Batters: ఐపీఎల్ చరిత్రలో మరపురాని బ్యాటర్స్ వీరే..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IPL Top Batters: ఐపీఎల్ చరిత్రలో మరపురాని బ్యాటర్స్ వీరే..
    ఐపీఎల్ చరిత్రలో మరపురాని బ్యాటర్స్ వీరే..

    IPL Top Batters: ఐపీఎల్ చరిత్రలో మరపురాని బ్యాటర్స్ వీరే..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 14, 2025
    10:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2025 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి.

    దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అత్యుత్తమ జట్ల మధ్య జరిగే ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఐపీఎల్ 18వ ఎడిషన్ మార్చి 22న ప్రారంభమవుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

    గత కొన్నేళ్లుగా, చాలా మంది బ్యాట్స్‌మెన్ తమ అద్భుతమైన ప్రదర్శనలతో, మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్‌లతో, మరపురాని క్షణాలతో అభిమానులను ఆకట్టుకున్నారు.

    అలాంటి అద్భుతమైన ప్రదర్శనల ద్వారా వారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తమ పేర్లను నిలిపారు.

    వివరాలు 

    1. క్రిస్ గేల్ (2013లో పూణే వారియర్స్ ఇండియాపై 175*)

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ తన కెరీర్ మొత్తం దూకుడుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి బౌలర్లను భయాందోళనకు గురిచేశాడు.

    2013లో పూణే వారియర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో గేల్ 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లతో అజేయంగా 175 పరుగులు చేశాడు.

    265.15 స్ట్రైక్ రేట్‌తో ఆడిన అతని ఇన్నింగ్స్ ఆర్‌సీబీకి 20 ఓవర్లలో 263/5 పరుగుల భారీ స్కోరు అందించింది.

    ఈ స్కోరును బౌలర్లు సమర్థవంతంగా కాపాడి పూణే వారియర్స్‌ను 133/9కి పరిమితం చేశారు.

    గేల్ చేసిన ఈ స్కోరు ఇప్పటికి టీ20 క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ వ్యక్తిగత ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది.

    వివరాలు 

    2. బ్రెండన్ మెకల్లమ్ (2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 158*)

    2008లో ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి 216.43 స్ట్రైక్ రేట్ సాధించాడు.

    ఈ ఇన్నింగ్స్ కారణంగా కేకేఆర్ 222/3 పరుగులు చేసింది. బౌలింగ్ విభాగం కూడా సమర్థవంతంగా రాణించడంతో ఆర్‌సీబీ 82 పరుగులకే ఆలౌట్ అయింది.

    మెకల్లమ్ ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఆధిపత్య వ్యక్తిగత ప్రదర్శనలలో ఒకటిగా గుర్తించబడింది.

    వివరాలు 

    3. విరాట్ కోహ్లీ (2016లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 113)

    విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2016లో రికార్డుల మోత మోగించాడు. మొత్తం 16 మ్యాచ్‌లలో 973 పరుగులు చేసిన కోహ్లీ, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 50 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 113 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

    అతను గాయపడి, కుడి బొటనవేలికి 8 కుట్లు పడినప్పటికీ, తన ఆటలో ఏమాత్రం తగ్గలేదు.

    ఆర్‌సీబీ 15 ఓవర్లలో 222/3 పరుగులు చేయడంలో అతని ఇన్నింగ్స్ కీలక భూమిక పోషించింది.

    వివరాలు 

    4. కీరన్ పొలార్డ్ (2021లో సీఎస్‌కేపై 87)

    ముంబై ఇండియన్స్ పవర్ హిట్టర్ కీరన్ పొలార్డ్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

    219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు, ముంబై 81/3 స్కోరులో ఉన్నప్పుడు పొలార్డ్ 24 బంతుల్లో 87 పరుగులు చేసి చివరి బంతికి విజయం సాధించేందుకు సహాయపడ్డాడు.

    అతని ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్‌కు గొప్ప విజయాన్ని అందించింది.

    వివరాలు 

    5. సురేష్ రైనా (2014 క్వాలిఫైయర్ 2లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 87)

    సురేష్ రైనా 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 25 బంతుల్లో 87 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

    కేవలం 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన అతను 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 348 స్ట్రైక్ రేట్ సాధించాడు.

    అయితే, జార్జ్ బెయిలీ రనౌట్ చేయడంతో సురేష్ రైనా క్రీజ్‌లో ఎక్కువసేపు నిలువలేకపోయాడు.

    అయినప్పటికీ, ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా గుర్తించబడింది.

    వివరాలు 

    6. ట్రావిస్ హెడ్ (2024లో ఆర్‌సీబీపై 102) 

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై తన విధ్వంసకర బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు.

    39 బంతుల్లో సెంచరీ సాధించిన అతను 41 బంతుల్లో 102 పరుగులు చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 287/3 స్కోరు చేయడానికి తోడ్పడ్డాడు.

    ఈ ఇన్నింగ్స్‌ను ఐపీఎల్ చరిత్రలో విదేశీ ఆటగాడు ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌లలో ఒకటిగా భావిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్

    తాజా

    Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌లో హై అలర్ట్‌.. భద్రతా మాక్‌డ్రిల్‌తో అప్రమత్తత! విజయవాడ వెస్ట్
    Indian Railways: భారత్‌ - పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారతీయ రైల్వే కీలక నిర్ణయం  ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ  ఆపరేషన్‌ సిందూర్‌
    Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ! మంచు మనోజ్

    ఐపీఎల్

    IPL Mega Auciton: మరికొన్ని గంటల్లో మెగా వేలం.. హాట్ ఫేవరెట్స్ ఎవరో తెలుసుకోండి! క్రికెట్
    Rishabh Pant : స్టార్క్ రికార్డు చెరిపేసిన రిషబ్ పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం శ్రేయస్ అయ్యర్
    Mallika Sagar: ఐపీఎల్‌ మెగా వేలంలో మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మల్లిక సాగర్‌ క్రికెట్
    IPL 2025 Mega Auction : గుజరాత్‌కు సిరాజ్‌.. హైదరాబాద్‌కు షమీ.. ఐపీఎల్‌ వేలంలో రికార్డు బిడ్డింగ్‌! సన్ రైజర్స్ హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025