Page Loader
Mumbai Indians: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే 
Mumbai Indians: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే

Mumbai Indians: ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2024
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత ఐపీఎల్‌ సీజన్‌లో పాయింట్ల పట్టికలో చిట్టచివరినా నిలిచిన ముంబై ఇండియన్స్‌ రానున్న సీజన్‌ కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో కోచింగ్ బృందంలో మార్పులు చేస్తోంది.హెడ్‌ కోచ్‌గా పనిచేస్తున్న మార్క్‌ బౌచర్‌ను తొలగించి,తిరిగి మహేల జయవర్ధెనెను ఆ బాధ్యతలు అప్పగించింది. ఇటీవల,టీమిండియా మాజీ బౌలింగ్‌ కోచ్ అయిన పరాస్‌ మంబ్రే (Paras Mhambrey)ను కూడా కోచింగ్‌ బృందంలోకి తీసుకుంది. ప్రస్తుత బౌలింగ్‌ కోచ్ అయిన లసిత్ మలింగతో కలిసి మంబ్రే పని చేయనున్నారు.ఈ విషయాన్ని వెల్లడిస్తూ ముంబయి ఇండియన్స్‌ బుధవారం సామాజిక మాధ్యమాల్లో ప్రకటన చేసింది. టీమ్‌ఇండియా 2024 టీ20 ప్రపంచ కప్‌ను సాధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో, భారత జట్టుకు మంబ్రే బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబై ఇండియన్స్ చేసిన ట్వీట్