NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2025: ఐపీఎల్ మెగా వేలం ముందు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కి షాక్ ఇచ్చిన డేల్ స్టెయిన్‌ 
    తదుపరి వార్తా కథనం
    IPL 2025: ఐపీఎల్ మెగా వేలం ముందు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కి షాక్ ఇచ్చిన డేల్ స్టెయిన్‌ 
    ఐపీఎల్ మెగా వేలం ముందు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కి షాక్ ఇచ్చిన డేల్ స్టెయిన్‌

    IPL 2025: ఐపీఎల్ మెగా వేలం ముందు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కి షాక్ ఇచ్చిన డేల్ స్టెయిన్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 17, 2024
    11:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్ 2025 మెగా వేలం ముందు సన్ రైజర్స్ హైదరాబాద్'ను వదిలిస్తున్నట్లు డేల్ స్టెయిన్‌ ప్రకటించాడు.

    గత సీజన్‌లో వ్యక్తిగత కారణాల వల్ల ఎస్ఆర్‌హెచ్‌కు దూరమైన అతడు, ఈ సీజన్‌లో అందుబాటులో ఉండనని స్పష్టంచేశాడు.

    అయితే, సౌతాఫ్రికా 20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతానని తెలియజేశాడు.

    గత రెండుసార్లు ఈస్టర్న్ కేప్‌ ఛాంపియన్‌గా నిలిచింది. హ్యాట్రిక్ సాధించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

    వివరాలు 

    స్‌ఏ 20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో పని చేస్తా: స్టెయిన్‌ 

    స్టెయిన్‌ మాట్లాడుతూ, "క్రికెట్ అనౌన్స్‌మెంట్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ధన్యవాదాలు. గత కొన్నేళ్లుగా బౌలింగ్‌ కోచ్‌గా అవకాశం ఇచ్చినందుకు నేను రుణపడి ఉంటా. దురదృష్టవశాత్తూ, ఐపీఎల్ 2025 సీజన్‌ కోసం ఎస్‌ఆర్‌హెచ్‌తో కలిసి పనిచేయలేకపోతున్నాను. కానీ, ఎస్‌ఏ 20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో పని చేస్తాను. మేం ఇప్పటికే రెండుసార్లు విజేతగా నిలిచాం. ఈసారి హ్యాట్రిక్‌ సాధించే నమ్మకం ఉంది" అని వెల్లడించాడు.

    వివరాలు 

    2018లో ఫైనల్స్‌కు వెళ్లడంలో డేల్ కీలక పాత్ర

    డేల్ కేవలం కోచ్‌గానే కాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకూ ప్రాతినిధ్యం వహించాడు.

    2016 సీజన్‌లో టైటిల్‌ విజేతగా నిలిచిన సందర్భంలో,2018లో ఫైనల్స్‌కు వెళ్లడంలో డేల్ కీలక పాత్ర పోషించాడు.

    గత సీజన్‌లో డేల్‌ స్థానంలో న్యూజిలాండ్ మాజీ పేసర్ జేమ్స్ ఫ్రాక్లిన్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ తాత్కాలిక బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది.

    ఇప్పుడు డేల్ స్థానంలో అతడికే పూర్తిస్థాయి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సన్ రైజర్స్ హైదరాబాద్
    ఐపీఎల్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    సన్ రైజర్స్ హైదరాబాద్

    సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు.. రికార్డులు ఐపీఎల్
    సన్ రైజర్స్ ఆటగాళ్ల బలాబలాలపై ఓ లుక్కేయండి..! ఐపీఎల్
    ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి టైటిల్‌ను ముద్దాడేనా ..? ఐపీఎల్
    IPL 2023: రాజస్థాన్ రాయల్స్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడించగలదా..? ఐపీఎల్

    ఐపీఎల్

    IPL Rohith Sharma: రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఎక్స్ పోస్ట్ లతో ఫ్యాన్స్ వార్ రోహిత్ శర్మ
    IPL-Cricket League : ఐపీఎల్ లో కోల్ కతా జట్టు మళ్లీ విజయాల బాట పట్టేనా? క్రీడలు
    IPL-Cricket-Chennai: వారి వల్లే గెలిచాం...చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై
    Adam Gilchrist- Hardik Pandya: హార్థిక్ పాండ్యా పూర్థి స్థాయి ఫిట్ నెస్ తో కనిపించలేదు: ఆడమ్ గిల్ క్రిస్ట్ ముంబై
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025