
IPL 2025: మనసు మార్చుకున్న దక్షిణాఫ్రికా.. ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లు అందుబాటులో
ఈ వార్తాకథనం ఏంటి
భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లోని మ్యాచ్‌లు వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే.
తాజా సమాచారం మేరకు,ఈ మ్యాచ్‌లు మళ్లీ మే 17వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఊరట కలిగించే కీలక ప్రకటనను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు విడుదల చేసింది.
మొదట, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లు మే 26వ తేదీ వరకు మాత్రమే ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటారని స్పష్టంచేసింది.
దీనికి కారణంగా జూన్‌లో ఆస్ట్రేలియాతో తాము ఆడాల్సిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచును పేర్కొంది.
వివరాలు
జూన్ 3న దక్షిణాఫ్రికా జింబాబ్వే వార్మప్ మ్యాచ్
దానికి తగిన సన్నాహకాలను జరిపేందుకు తాము ఐపీఎల్ కంటే ఆ మ్యాచ్‌కే ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించింది.
కానీ ఈ ప్రకటన అనంతరం దక్షిణాఫ్రికా బోర్డు తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని యూటర్న్ ఇచ్చింది.
తాజాగా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించిన కొత్త నిర్ణయంతో, సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ 2025 ముగిసే వరకు తమ తమ జట్లకు అందుబాటులోనే ఉండనున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సన్నద్ధమవ్వాల్సిన నేపథ్యంలో సౌతాఫ్రికా తమ సన్నాహక కార్యక్రమాలను కాస్త కుదించినట్లు వెల్లడించింది.
షెడ్యూల్ ప్రకారం జూన్ 3న దక్షిణాఫ్రికా జింబాబ్వేతో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితులలో ఆ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి.
వివరాలు
ఐపీఎల్ చివరి మ్యాచ్ వరకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు
ఈ నేపథ్యంలో, "మా షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.మేము జూన్ 3 నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సన్నాహకాలను ప్రారంభించబోతున్నాం,"అని క్రికెట్ దక్షిణాఫ్రికా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఎనోచ్ ఎంక్వే మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
దీంతో ఐపీఎల్‌లో పాల్గొంటున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తమ జట్లకు చివరి మ్యాచ్ వరకు సహకరించనున్నారు.
గుజరాత్ టైటాన్స్‌కు చెందిన కగిసో రబాడా,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న లుంగి ఎంగిడి,ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉన్న ట్రిస్టన్ స్టబ్స్,లఖ్నవూ సూపర్ జెయింట్స్‌కు క్రీడిస్తున్న ఐడెన్ మార్క్రమ్,ముంబయి ఇండియన్స్ తరఫున ఉన్న ర్యాన్ రికెల్టన్ మరియు కార్బిన్ బాష్, పంజాబ్ కింగ్స్‌కు చెందిన మార్కో జాన్సన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఉన్న వియాన్ ముల్డర్‌లు అందుబాటులో ఉండనున్నట్లు స్పష్టమైంది.