IPL: ఐపీఎల్ 2025 గ్రాండ్ ఓపెనింగ్ సర్వం సిద్ధం.. డ్యాన్స్, మ్యూజిక్‌తో దద్దరిల్లనున్న మైదానం!
ఈ వార్తాకథనం ఏంటి
ధనాధన్ క్రికెట్ టోర్నమెంట్ అయిన ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతాలో మొదటి మ్యాచ్ జరగనుంది.
ఇందులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానులు భారీగా ఆసక్తి చూపుతున్నారు.
ఈ సీజన్‌లో ప్రతి జట్టు టైటిల్ సాధించాలని పట్టుదలగా ప్రాక్టీస్ చేస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందుగా, ఐపీఎల్ నిర్వాహకులు మునుపటి సీజన్ల మాదిరిగానే ఓ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఈ ప్రారంభోత్సవంలో ఎవరెవరు ప్రదర్శనలు ఇవ్వబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
Details
శ్రద్ధా, వరుణ్ డ్యాన్స్ ఫెస్టివల్
ప్రతి ఐపీఎల్ ప్రారంభానికి ముందు బీసీసీఐ అత్యంత వైభవంగా ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి ఈ వేడుకలో పాల్గొనబోయే సెలబ్రిటీల పేర్లు కూడా ఆసక్తికరంగా మారాయి.
ప్రముఖ బాలీవుడ్ నటీనటులు శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ ఈ వేడుకలో స్టేజ్‌పై అదిరిపోయే డ్యాన్స్ షో ఇవ్వబోతున్నారని సమాచారం.
ఈ జంట స్క్రీన్‌పై తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించినట్లు, ఐపీఎల్ ఓపెనింగ్ నైట్‌లోనూ గ్లామర్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను పెంచుతారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
వీరితో పాటు ప్రఖ్యాత గాయకులు అరిజిత్ సింగ్, శ్రేయ ఘోషాల్, పంజాబీ సింగర్ కరణ్ ఔజ్లా కూడా తమ పాటలతో ఐపీఎల్ ఆరంభ వేడుకను మరింత ఉత్సాహభరితం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
Details
మార్చి 22న ప్రారంభం
మరికొంత మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో భాగం కానున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ స్టార్ ప్రదర్శనలతో పాటు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు బీసీసీఐ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
మార్చి 22న మొదలయ్యే ఐపీఎల్ 18వ సీజన్ మే 25న ఫైనల్‌తో ముగియనుంది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో ఐదు సార్లు టైటిల్ గెలుచుకోగా, కోల్‌కతా నైట్ రైడర్స్ మూడు సార్లు విజేతగా నిలిచింది.
మరోవైపు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ వంటి జట్లకు టైటిల్ గెలిచే అవకాశాలు ఎన్నో వచ్చాయి కానీ చివర్లో చేజారిపోయాయి.
ఈసారి వీరు ట్రోఫీని ముద్దాడతారా? లేక మళ్లీ నిరాశే ఎదురవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.