LOADING...
RCB vs LSG : కోహ్లీని దెబ్బకొట్టేందుకు లక్నో మాస్టర్ ప్లాన్
కోహ్లీని దెబ్బకొట్టేందుకు లక్నో మాస్టర్ ప్లాన్

RCB vs LSG : కోహ్లీని దెబ్బకొట్టేందుకు లక్నో మాస్టర్ ప్లాన్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 15, 2026
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026లో మరో రసవత్తర పోటీకి వేదిక సిద్ధమైంది. ఈ రోజు (బుధవారం) లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా బంతి వేసిన రికార్డు కలిగిన మయాంక్ యాదవ్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని లక్నో జట్టు డైరెక్టర్ టామ్ మూడీ వెల్లడించారు. మయాంక్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని, మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నాడని ఆయన తెలిపారు.

వివరాలు

రెండు మ్యాచులకే పరిమితం..

గత ఐపీఎల్ 2025 సీజన్‌లో గాయం కారణంగా మయాంక్ యాదవ్ కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. దాదాపు ఏడాది పాటు అతడు మైదానానికి దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పటివరకు లక్నో జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడినా, మయాంక్‌కు అవకాశం ఇవ్వలేదు. దీనిపై టామ్ మూడీ మాట్లాడుతూ, వర్క్‌లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి వరకు అతడిని ఆడించలేదని చెప్పారు. అయితే ఆర్‌సీబీతో జరిగే ఈ మ్యాచ్‌లో అతను తప్పకుండా ఆడతాడని స్పష్టం చేశారు.

వివరాలు

రసవత్తరంగా జరగనున్న మ్యాచ్..

ఇక మరో పేసర్ మొహ్సిన్ ఖాన్ కూడా గాయం నుంచి కోలుకున్నాడు. బుధవారం జరగనున్న ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే, అతను కూడా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఇద్దరు వేగవంతమైన బౌలర్లు అందుబాటులోకి వస్తే, లక్నో జట్టు బౌలింగ్ విభాగం మరింత బలపడనుంది. ప్రస్తుతం అనుభవజ్ఞుడైన మహ్మద్ షమీ ఆ జట్టు బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తున్నాడు. పాయింట్ల పట్టిక విషయానికి వస్తే, లక్నో సూపర్ జెయింట్స్ ప్రస్తుతం ఏడవ స్థానంలో ఉండగా, ఆర్‌సీబీ మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి తమ స్థానాలను మెరుగుపరుచుకోవాలని ఇరు జట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Advertisement