IPL 2026: పంజాబ్ పవర్‌ఫుల్ హిట్టింగ్.. లక్నోకు చుక్కలు చూపించారు!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. పంజాబ్ ఖాతాలో మరో భారీ విజయం చేరింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. లక్నోపై గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. పంజాబ్ బ్యాటర్లు సిక్సర్ల సునామీ సృష్టిస్తూ పరుగుల వరద పారించారు. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
వివరాలు
భారీ స్కోర్ చేసిన పంజాబ్..
పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జయంట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సిక్సుల వర్షం కురిసింది. పంజాబ్ బ్యాటర్లు లక్నో బౌలర్లను చితక్కొట్టేశారు. ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కొన్నొలీ చేసిన విధ్వంసంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కొన్నొలీ అద్భుతమైన హాఫ్ సెంచరీలు నమోదు చేసి సెంచరీకి కొద్ది దూరంలోనే ఔట్ అయ్యారు.
వివరాలు
సిక్సర్ల వర్షం కురిసిందిలా..
ఆర్య కేవలం 37 బంతుల్లో 93 పరుగులు (9 సిక్సులు, 4 ఫోర్లు) బాదగా, కొన్నొలీ 46 బంతుల్లో 87 పరుగులు (8 ఫోర్లు, 7 సిక్సులు) చేశారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు కేవలం 80 బంతుల్లోనే 182 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. వీరు ఔట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ (5) త్వరగానే పెవిలియన్ చేరాడు. అయితే చివర్లో మార్కస్ స్టోయినిస్ 28(2 ఫోర్లు, 2 సిక్సులు), శశాంక్ (17) వేగంగా పరుగులు చేయడంతో పంజాబ్ స్కోర్ 254 వరకు వెళ్లింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో:
150-plus stands for PBKS in the IPL
— Cricketopia (@CricketopiaCom) April 19, 2026
206 - Adam Gilchrist & Shaun Marsh vs RCB, Dharamsala, 2011
183 - KL Rahul & Mayank Agarwal vs RR, Sharjah, 2020
182 - Priyansh Arya & Cooper Connolly vs LSG, Mullanpur, 2026 pic.twitter.com/g06I7TqUW3