LOADING...
IPL 2026: హైదరాబాద్‌లో SRH vs CSK పోరు… గెలుపు ఎవరిది?
హైదరాబాద్‌లో SRH vs CSK పోరు… గెలుపు ఎవరిది?

IPL 2026: హైదరాబాద్‌లో SRH vs CSK పోరు… గెలుపు ఎవరిది?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 17, 2026
10:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026లో 27వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ శనివారం జరగనుంది. డబుల్ హెడర్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు SRH ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించగా, CSK తమ గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో SRH తమ హోమ్ గ్రౌండ్‌లో రఫ్పాడించనుంది. బలహీనంగా కనిపిస్తున్న చెన్నై జట్టును అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంది.

వివరాలు

బ్యాటర్లు సత్తాచాటే అవకాశం..

ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ ఈసారి బలంగా కనిపిస్తోంది. CSK జట్టుకు గాయాల సమస్యలు కొనసాగుతున్నాయి. స్పీడ్ బౌలర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఎడమచేతి పేసర్ ముకేష్ చౌదరి ఆడే అవకాశముంది. అనుభవం ఉన్న స్థిరమైన పేసర్ లేని లోటు CSKకి పెద్ద సమస్యగా మారింది. ఇదే బలహీనతను SRH టాప్ ఆర్డర్ ఉపయోగించుకోవాలని చూస్తోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ లాంటి బలమైన బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు.

వివరాలు

ఆధిక్యంలో హైదరాబాద్ జట్టు..

మరోవైపు హైదరాబాద్ టీమ్ వద్ద మంచి ఫామ్‌లో ఉన్న పేస్ బౌలర్లు కూడా ఉన్నారు. చెన్నై బ్యాటింగ్ లైనప్ కూడా బలంగానే ఉంది. ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్ , బ్రేవిస్ లాంటి ఆటగాళ్లు జట్టుకు బలం ఇస్తున్నారు. హెడ్ టు హెడ్ రికార్డు విషయానికి వస్తే, ఐపీఎల్‌లో ఈ రెండు జట్ల మధ్య పోరు ఇప్పటివరకు ఒకపక్కగా ఉంది. మొత్తం 22 మ్యాచ్‌ల్లో CSK 15 విజయాలు సాధించింది. ఎస్ఆర్హెచ్ 7 మ్యాచ్‌లు గెలిచింది. అయితే హోమ్ గ్రౌండ్‌లో మాత్రం హైదరాబాద్ జట్టుకు స్వల్ప ఆధిక్యం ఉంది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ 3-2 ఆధిక్యంలో ఉంది.

Advertisement