Loading...
#Play of the day: శాంసన్ ఇలా చేశావేంటి భయ్యా..! సీఎస్కేకు వరుసగా రెండో ఓటమి
శాంసన్ ఇలా చేశావేంటి భయ్యా..! సీఎస్కేకు వరుసగా రెండో ఓటమి

#Play of the day: శాంసన్ ఇలా చేశావేంటి భయ్యా..! సీఎస్కేకు వరుసగా రెండో ఓటమి

వ్రాసిన వారు Moogati Shabari
Apr 04, 2026
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెపాక్ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ సీజన్‌లో ఇది వారికి వరుసగా రెండో పరాజయం కావడం గమనార్హం. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో కూడా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయిన ఎల్లో ఆర్మీ నిరాశలో ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి మంచి ఫామ్‌ను కొనసాగిస్తోంది. జట్టు ప్రదర్శన చూస్తే హ్యాట్రిక్ విజయాల దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. అదనంగా, తమ స్వంత మైదానంలో చెన్నై జట్టు వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఆందోళనకర అంశంగా మారింది.

వివరాలు 

అతని గురించే చర్చ..

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అయితే ఓపెనర్ సంజు శాంసన్ మరోసారి నిరాశపరిచాడు.

అతను కేవలం 7 పరుగులకే అవుట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కూడా అతను 6 పరుగులకే పరిమితమయ్యాడు.

సంజు శాంసన్ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ నుండి చెన్నై జట్టులోకి అతని మార్పు సందర్భంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ముఖ్యంగా సీఎస్కే తరఫున కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాడని ఆశలు వ్యక్తమయ్యాయి.

వివరాలు 

హెడ్ కోచ్ సపోర్ట్ అతనికే..

చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అతని విషయంలో పెద్దగా ఆందోళన చెందడం లేదు.

శాంసన్ కెరీర్‌లో ఇలాంటి ప్రారంభాలు సాధారణమేనని, మొదట నెమ్మదిగా ఆడే అతను తర్వాత దూకుడును పెంచుతాడని వారు నమ్ముతున్నారు.

టీ20 వరల్డ్ కప్‌లో కూడా అతను ప్రారంభ మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా, తరువాతి దశల్లో అద్భుతంగా రాణించాడు.

ప్లేఆఫ్స్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో అర్ధశతకాలు సాధించి జట్టుకు కీలకంగా మారాడు.

ఆ ప్రదర్శనతోనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గెలుచుకున్నాడు.

ప్రస్తుత సీజన్‌లో కూడా ఇదే విధంగా తిరిగి ఫామ్‌లోకి వస్తాడని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ADVERTISEMENT