IPL 2026: చెపాక్‌లో చెలరేగిన చెన్నై.. ఎట్టకేలకు ఐపీఎల్‌లో తొలి విజయం
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో (చెపాక్) జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన CSK నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు, వారిలో అక్షర్ పటేల్ మాత్రమే ఒక వికెట్ తీసుకోగలిగాడు.
వివరాలు
ఆ వ్యూహం ఫలించిందిలా..
ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. అతడు కేవలం 55 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 115 పరుగులు చేశాడు. అతనితో పాటు ఆయుష్ మాత్రే 59 పరుగులతో రాణించగా, దూబే కేవలం 10 బంతుల్లో 20 పరుగులు చేసి వేగంగా స్కోరు పెంచాడు. మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన, అరుదైన ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల యువ ఆటగాడు ఆయుష్ మాత్రే మంచి ఫామ్‌లో 36 బంతుల్లో 59 పరుగులు చేసి ఆడుతున్న సమయంలో, CSK మేనేజ్‌మెంట్ వ్యూహాత్మకంగా అతడిని "రిటైర్డ్ ఔట్"గా వెనక్కి పంపింది. చివరి ఓవర్లలో మరింత వేగంగా పరుగులు రాబట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
చెలరేగిన శాంసన్..
అదే విధంగా, సంజు శాంసన్ ఈ ఇన్నింగ్స్‌లో మరో ముఖ్యమైన మైలురాయిని కూడా అందుకున్నాడు. అతడు టీ20 క్రికెట్‌లో 400 సిక్సర్లు పూర్తి చేసిన ఘనత సాధించాడు. ఐపీఎల్ 2026కు ముందు CSKలో చేరిన శాంసన్, గత మూడు మ్యాచ్‌లలో పెద్దగా రాణించలేకపోయాడు. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రీబౌన్స్ అయ్యి తన ఫామ్‌ను తిరిగి నిరూపించుకున్నాడు.