Virat Kohli-Fine-IPL: విరాట్ కోహ్లీకి ఐపీఎల్ అడ్వైజరీ జరిమానా
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)జట్టు సభ్యుడు విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఐపీఎల్(IPL)అడ్వైజరీ జరిమానా విధించింది. ఆదివారం పంజాబ్(Punjab)జట్టుపై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ జట్టు ఓటమిపై పాలైంది. ఈ ఓటమితో ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయి టోర్నీ నుంచి వైదొలిగే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు తప్పకుండా గెలవాల్సి ఉంది. అయితే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అనూహ్యం గా అవుట్ అయ్యాడు. బౌలర్ వేసిన ఫుల్ టాస్ బాల్ ను క్రీజు ముందుకు వచ్చి ఆడాడు. అయితే బాల్ నడుముకంటే ఎక్కువ పైకి రావడంతో బ్యాట్ అడ్డు పెట్టగా ఒక్కసారిగా బాల్ పైకి లేచింది.
వాగ్వాదానికి దిగినందుకే జరిమానా
వెంటనే ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడు. దీనిపై రివ్యూ కోరగా థర్డ్ అంపైర్ కూడా విరాట్ కోహ్లీని అవుట్ గా ప్రకటించాడు. అంపైర్ దీన్ని నోబాల్ ప్రకటించకపోవడంతో గ్రౌండ్ లో ఉన్న అంపైర్ తో కోహ్లీ వాగ్వాదానికి దిగాడు. నడుముకంటే ఎక్కువ ఎత్తులో వచ్చిన ఫుల్ టాస్ బంతే అయినప్పటికీ కోహ్లీ క్రీజు ముందుకొచ్చి ఆడటం వల్ల అది అవుటేనని, కోహ్లీ క్రీజు ముందుకు రాకుంటే బాల్ నడుముకంటే తక్కువ ఎత్తులో నే వచ్చేదని అంపైర్లు వివరణ ఇచ్చారు. దీంతో విరాట్ కోహ్లికి ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ మ్యాచ్లో 50% ను జరిమానాగా విధించింది. అంతకుముందు స్లో ఓవర్ రేట్ కారణంగా ఫాప్ డుప్లెసిస్, సామ్ కరణ్ కు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.