ఐపీఎల్ అప్పుడే మరో స్థాయికి వెళ్లింది : రవిశాస్త్రి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ మొదటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సంచలనాలను నమోదు చేసింది. ఇప్పటికే ఈ టోర్ని చాలా దేశాల్లో విజయవంతం కావడంతో ఆ ప్రాంతాల్లో లీగ్‌లు పుట్టుకొచ్చాయి. ఐపీఎల్ గురించి మాజీ టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ను 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించడంతో టోర్నీని మరో స్థాయికి వెళ్లిందని ఆయన చెప్పాడు. 2009లో దేశంలో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో అప్పట్లో ఐపీఎల్ ను దక్షిణాఫ్రికాకు తరలించిన విషయం తెలిసిందే. అప్పుడు రవిశాస్త్రి ఐపీఎల్ పాలకవర్గం సభ్యుడిగా కొనసాగాడు. అప్పట్లో దక్షిణాఫ్రికా లో ఐపీఎల్ కు వచ్చిన ఆదరణ గురించి కొన్ని విషయాలను రవిశాస్త్రి పంచుకున్నాడు.
దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ కు చక్కటి ఆదరణ
దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ జరిగినప్పుడు భారత్ లో చూసినంత ఆసక్తిగా చూడడం అశ్చర్యాన్ని గురి చేసిందని, అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా జనం తమకు నచ్చిన జట్లను ఎంచుకోవడం ప్రారంభించారని, సాధారణంగా ఇలాంటివి ఫుట్ బాల్ లో జరుగుతాయని, కానీ ఐపీఎల్ లో కూడా జట్లను ఎంచుకోవడం 2019 సీజన్ లోనే మొదలైందని రవిశాస్త్రి వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ కు చక్కటి ఆదరణ లభిస్తోందని, భవిష్యతులో కూడా ఐపీఎల్ మరెన్నో అద్భుతాలను సృష్టిస్తుందని ఆయన తెలియజేశారు. నేటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.