LOADING...
IPL 2026: అరుణ్ జైట్లీ స్టేడియంలో బట్లర్ దుమ్మురేపే రికార్డులు.. ఈసారి కూడా మెరుస్తాడా?
అరుణ్ జైట్లీ స్టేడియంలో బట్లర్ దుమ్మురేపే రికార్డులు.. ఈసారి కూడా మెరుస్తాడా?

IPL 2026: అరుణ్ జైట్లీ స్టేడియంలో బట్లర్ దుమ్మురేపే రికార్డులు.. ఈసారి కూడా మెరుస్తాడా?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 08, 2026
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోష్ బట్లర్ ఇటీవలి కాలంలో ఫామ్ తగ్గినా, మళ్లీ పుంజుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న బట్లర్, ఈ ఐపీఎల్ సీజన్‌ను సాధారణ ప్రదర్శనలతో ప్రారంభించాడు. ఈ నెల 8న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్ అతనికి కీలకంగా మారింది. ఈ మైదానంలో అతని స్ట్రైక్‌రేట్ 170కి పైగా ఉండటం విశేషం.

వివరాలు

ఢిల్లీలో బట్లర్ రికార్డులివే

అరుణ్ జైట్లీ స్టేడియంలో బట్లర్ అద్భుత రికార్డులు కలిగి ఉన్నాడు. మొత్తం ఐదు ఇన్నింగ్స్‌లలో 253 పరుగులు చేసి, సగటు 50.60గా నమోదు చేశాడు. ఈ మైదానంలో అతని స్ట్రైక్‌రేట్ 174.48గా ఉంది. ముఖ్యంగా అతని ఐపీఎల్ కెరీర్‌లో ఉన్న ఏడు సెంచరీలలో ఒకటి (124 పరుగులు) ఇదే వేదికపై సాధించాడు. అదనంగా ఒక హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు.

వివరాలు

ఐపీఎల్ కెరీర్‌ సాగిందిలా..

ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో (పంజాబ్ కింగ్స్‌పై 38, రాజస్థాన్ రాయల్స్‌పై 26) సాధారణ స్కోర్లు చేసినప్పటికీ, బట్లర్‌లో మంచి ఫామ్‌తో ఉన్నట్లు కనిపించాయి. ఇప్పటివరకు మూడు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన అతను, మొత్తం 4,184 పరుగులు చేసి దాదాపు 40 సగటును కొనసాగిస్తున్నాడు. టోర్నీలో అతని స్ట్రైక్‌రేట్ 149.16గా ఉంది. కెరీర్‌లో 7 సెంచరీలు, 24 అర్ధసెంచరీలు నమోదు చేశాడు.

Advertisement