Page Loader
IPL-Lucknow-Mumbai Indians-Play off: హ్యాట్రిక్​ ఓటములతో ఐపీఎల్​ ప్లే ఆఫ్​ అవకాశాలను కోల్పోయిన ముంబై ఇండియన్స్​ జట్టు
ముంబై ఇండియన్స్​ జట్టు

IPL-Lucknow-Mumbai Indians-Play off: హ్యాట్రిక్​ ఓటములతో ఐపీఎల్​ ప్లే ఆఫ్​ అవకాశాలను కోల్పోయిన ముంబై ఇండియన్స్​ జట్టు

వ్రాసిన వారు Stalin
May 01, 2024
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) జట్టు పరాజయాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ముంబై గడ్డపై ఆ జట్టుకు హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది. మంగళవారం రాత్రి లఖ్ నవూ సూపర్ జెయింట్స్ క్రికెట్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో ముంబయి జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది . తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 14 4 పరుగులకే పరిమితం కాగా జట్టు 19.2 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. లఖ్ నవు జట్టు బ్యాటర్​ లు మార్కస్ స్టాయినిస్ 45 బంతుల్లో 62 పరుగులు చేశారు.

Lakhnavu-Mumai Indians

ప్లే ఆఫ్​ అవకాశాలను కోల్పోయిన ముంబై జట్టు

కెప్టెన్ కేఎల్ రాహుల్ 22 బంతుల్లో 28 పరుగులు దీపక్ హుడా 18బంతుల్లో 18 , పూరన్ 14 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్ విజయంతో లఖ్ నవు ఆరు విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరచుకుంది. కాగా, ముంబై ఆడిన పది మ్యాచ్ లలో ఏడు ఓటములతో ఐపీఎల్​ ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయింది .