
IPL: ధర్మశాల స్టేడియంలో పంజాబ్, దిల్లీ మధ్య జరుగుతోన్న మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ధర్మశాలలోని స్టేడియంలో పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు.
స్టేడియంలోని ఫ్లడ్ లైట్లలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.
స్టేడియం పరిధిలో విద్యుత్ సరఫరాలో వచ్చిన అంతరాయం వల్ల ఫ్లడ్‌లైట్లలో ఒకటి పనిచేయకుండా పోవడం దీని ప్రధాన కారణంగా గుర్తించారు.
ఈ పరిస్థితుల్లో మ్యాచ్‌ను కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో, నిర్వాహకులు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
స్టేడియానికి హాజరైన ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యం పట్ల బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) విచారం వ్యక్తం చేసింది.
వివరాలు
ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ జట్టుకు శుభారంభాన్ని అందించారు
మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కారణంగా ఆట ప్రారంభం ఒక గంట పాటు ఆలస్యం కాగా, చివరికి రాత్రి 8:30 గంటలకు ప్రారంభమైంది.
ఆట నిలిపివేసే సమయానికి పంజాబ్ కింగ్స్ జట్టు 10.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 122 పరుగులు చేసింది.
ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ అద్భుతంగా ఆడి జట్టుకు శుభారంభాన్ని అందించారు.
ప్రియాంశ్ ఆర్య 34 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 70 పరుగులు నమోదు చేశాడు, కాగా ప్రభ్‌సిమ్రన్ సింగ్ 28 బంతుల్లో 7 ఫోర్లతో 50 పరుగులు చేశాడు.
ప్రియాంశ్ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే మ్యాచ్‌ను రద్దు చేశారు.