IPL Play of the Day: రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్న గుజరాత్..సత్తా చాటిందిలా..
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 19వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం నిర్వహించిన 'డబుల్ హెడర్'లో మొదటి మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలుపొందింది. గత పోరులో ముకుల్ చౌదరి అద్భుత ప్రదర్శనతో గెలిచిన లక్నో జట్టు, ఈసారి మాత్రం బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సరైన ప్రతిఘటన చూపించలేకపోయింది.
వివరాలు
ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత బౌలింగ్..
టాస్‌లో ఓడిపోయిగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 164 పరుగులు సాధించింది.
ఓపెనర్ మార్క్‌రమ్ 21 బంతుల్లో 30 పరుగులు చేసి (5 ఫోర్లు, 1 సిక్స్) అత్యధిక స్కోరు నమోదు చేశాడు. మిగతా బ్యాటర్లలో ఎవ్వరూ 20 పరుగుల మైలురాయిని దాటలేకపోయారు.
కెప్టెన్ రిషభ్ పంత్ 18, మార్ష్ 11, ఆయుష్ బదోని 9, పూరన్ 19, అబ్దుల్ సమద్ 18, ముకుల్ చౌదరి 18, జార్జ్ లిండే 16, షమీ నాటౌట్‌గా 12 పరుగులు చేశారు.
గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
వివరాలు
సునాయాసంగా గెలుపు సాధించారిలా..
అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు, 18.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది.
జోస్ బట్లర్ 37 బంతుల్లో 60 పరుగులు (11 ఫోర్లు) చేసి మెరిశాడు. కెప్టెన్ శుభమన్ గిల్ కూడా 40 బంతుల్లో 56 పరుగులు (6 ఫోర్లు, 1 సిక్స్) చేసి అర్ధశతకంతో జట్టును విజయానికి నడిపించాడు.
లక్ష్యం పెద్దది కాకపోవడంతో గుజరాత్ జట్టు సులభంగా ఛేదించింది.
వివరాలు
స్కోరు వివరాలివే..
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్క్‌రమ్ (సి) సుందర్ (బి) ప్రసిద్ధ్ - 30;
మార్ష్ (సి) గిల్ (బి) రబాడ - 11;
పంత్ (సి) తెవాటియా (బి) సిరాజ్ - 18;
బదోని (సి) ఫిలిప్స్ (బి) ప్రసిద్ధ్ - 9;
పూరన్ (సి) గిల్ (బి) ప్రసిద్ధ్ - 19;
అబ్దుల్ సమద్ (సి) ఫిలిప్స్ (బి) అశోక్ - 18;
ముకుల్ (సి) బట్లర్ (బి) ప్రసిద్ధ్ - 18;
లిండే (సి) (సబ్) షారుక్ (బి) అశోక్ - 16;
షమీ (నాటౌట్) - 12;
అవేశ్ (నాటౌట్) - 4;
ఎక్స్‌ట్రాలు - 9;
మొత్తం: 20 ఓవర్లలో 8 వికెట్లకు 164 పరుగులు.
వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్:
సాయి సుదర్శన్ (సి)అవేశ్ (బి)రాఠీ- 15;
గిల్ (సి) పంత్ (బి) ప్రిన్స్ - 56;
బట్లర్ (సి) మార్క్‌రమ్ (బి) షమీ - 60;
సుందర్ (నాటౌట్) - 21;
తెవాటియా (నాటౌట్) - 10;
ఎక్స్‌ట్రాలు - 3;
మొత్తం: 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 165 పరుగులు.
వికెట్ల పతనం: 1-45, 2-129, 3-135.